జగన్ కేసులో అతి పెద్ద సాక్షాన్ని సంపాదించిన బ్రదర్ అనిల్ కుమార్

Brother Anil Kumar, who gained the largest testimony in the Jagan case,

జగన్ కేసులో అతి పెద్ద సాక్షాన్ని సంపాదించిన బ్రదర్ అనిల్ కుమార్


వైఎసార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన హత్యాయత్నం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. టీడీపీ వాళ్ళే చేయించారని వైసీపీ వాళ్ళు, సానుభూతి కోసం వైసీపీ వాళ్ళే ఇలా చేసుకున్నారని టీడీపీ వాళ్ళు, అలాంటి రాజకీయాలు లేవు, కేవలం ప్రజాసమస్యలని జగన్ దృష్టికి తీసుకెళ్ళేందుకే ఈ ఘటనకి పాల్పడ్డానని నిందితుడు శ్రీనివాస్ తమ వాదనలని వినిపిస్తున్నారు. ఈ ముగ్గురి వాదనల్లో ఎవరి వాదనలో నిజం ఉందో తెలీదు కానీ, నిందితుడు మాత్రం ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్నాడు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నా, లేకపోయినా నిందితుడు చేసింది మాత్రం తప్పు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు. 

ఐతే, ఈ రాజకీయాల వల్ల తాను ఎక్కడ బలైపోతాడో అని భయపడి వణికిపోతున్నాడు. బెయిలు మీద బయటకి వస్తే ఏదో ఒక పార్టీ వాళ్ళు తనని చంపేస్తారేమో అని భయపడుతున్నాడు. అతను భయపడడానికి మూడు కారణాలు ఉన్నాయి. వైసీపీ కోణం నుంచి చూస్తే టీడీపీ వాళ్ళు చేయించారు కాబట్టి నిజం చెప్తాడేమో అని నిజం బయటకి రాకుండా చంపేయచ్చు. ఇది మొదటి కారణం. టీడీపీ కోణం నుంచి చూస్తే వైసీపీ వాళ్ళే చేయించుకున్నారు కాబట్టి వాళ్ళే చంపేయచ్చు. ఇది రెండవ కారణం. ఈ రెండు పార్టీల వాళ్ళు చేయించింది కాదు కాబట్టి తమ పార్టీల ప్రయోజనాల కోసం ఏదో ఒక పార్టీ వాళ్ళు అతన్ని బలి చేసేయచ్చు. ఇది మూడవ కారణం. 

ఈ మూడు కారణాల వల్ల అతనికి చావు భయం పట్టుకుందని లాయర్ అంటున్నారు. బెయిల్ పిటిషన్ చేసిన లాయర్ సలీం శ్రీనివాస్ ని జైల్లో కలిశానని, రాజకీయాల కోసం తనని చంపేస్తారేమో అని భయంతో వణికిపోతున్నాడని అన్నారు. మరోపక్క జగన్ పై దాడి కేసులో జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ ఒక బలమైన సాక్ష్యాన్ని సంపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం చేసే ఎంక్వైరీలో నిజాలు రావని తెలిసి ఆయన వేరే రూట్ లో ఈ కేసుని సీక్రెట్ గా ఎంక్వైరీ చేయించారట. ఈ ఎంక్వైరీలో నిందితుడు శ్రీనివాస్ కి, టీడీపీ నేతలకి మధ్య సంబంధం ఉందని, జగన్ పై దాడి చేయాలని ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయని తేలింది. 

ఐతే, అనుకున్న ప్లాన్ కంటే ముందే నిందితుడు దాడి చేయడంతో టీడీపీ పార్టీ ఇరుకుల్లో పడినంత పనయ్యిందని అంటున్నారు. అందుకే టీడీపీ కుట్రను బయటపెట్టేందుకు వైసీపీ నేతలు శ్రీనివాస్ ను బెయిలు మీద బయటకి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అతను బయటకు రాగానే మీడియాతో అతను మాట్లాడే సంచలన నిజాలు టీడీపీ పార్టీని పూర్తిగా దెబ్బ తీస్తాయని, తద్వారా జగన్ కి తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు. 

Comments