చ‌ర్చ‌కొస్తారా..? చెక్కేస్తారా..?

Carcakostara ..? Cekkestara ..?

చ‌ర్చ‌కొస్తారా..? చెక్కేస్తారా..?


ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో బీజేపీ, టీడీపీ మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. తాడేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి విష‌యంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం వెంక‌ట‌రామ‌న్న గూడెంలో మీడియా సాక్షిగా చ‌ర్చ‌కు రెండు పార్టీలు సిద్ధ‌మ‌య్యాయి. బుధ‌వారం రాత్రే టీడీపీ నేత ముళ్ల‌పూడి బాపిరాజును ఓ టీడీపీ కార్య‌క‌ర్త ఇంట్లో నిర్బంధించారు పోలీసులు.


మ‌రోప‌క్క‌, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల‌రావు ఇళ్లు హై టెన్ష‌న్‌కు సెంట‌ర్‌పాయింట్‌గా మారింది. ఉద‌యం నుంచి జ‌రుగుతున్న ఉద్రిక్త‌త‌కు కొన‌సాగింపుగా మాణిక్యారావును పోలీసులు బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, అంత‌కు ముందు మాణిక్యాల‌రావు ఇంటి గేటు ద‌గ్గ‌ర మోహ‌రించిన పోలీసుల వ‌ల‌యాన్ని తోసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చారు. 

పోలీసుల‌ను బ‌య‌ట‌కు గెంటేసిన మాణిక్యాల‌రావు అనుచ‌రులు రోడ్డు మీద‌కొచ్చారు. త‌హ‌శీల్దారు కార్యాల‌యం ప్రారంభోత్స‌వానికి వెళుతున్నానంటూ ముందుకు వెళ్ల‌బోయిన మాణిక్యాల రావును పోలీసులు బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు, మాణిక్యాల‌రావు అనుచ‌రుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. 
 

Comments