కాంగ్రెస్‌లో బుజ్జ‌గింపుల ప‌ర్వం..!

Fraudulence in the Congress ..!


కాంగ్రెస్‌లో బుజ్జ‌గింపుల ప‌ర్వం..!

కాంగ్రెస్‌ అధిష్టానం బుజ్జ‌గింపులు మొద‌లు పెట్టింది. డీకే అరుణ‌, స‌బితా ఇంద్రారెడ్డి, దామోద‌ర రాజ న‌ర్సింహా, కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి   స‌హా ప‌లువురు ముఖ్య నేత‌ల‌కు ఢిల్లీకి రావాల‌ని కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వ‌చ్చింది. ఢిల్లీ వేదిక‌గా కాగ్రెస్ అభ్య‌ర్ధుల ఎంపిక ప్ర‌క్రియ ఈ రోజు జ‌ర‌గ‌నుంది. స్ర్కీనింగ్ క‌మిటీలో ఖ‌రారు కాని 15 స్థానాల‌కు చెందిన అభ్య‌ర్థులను కూడా ఢిల్లీకి రావాల్సిందిగా హైక‌మాండ్ ఆదేశించింది.

సూర్యాపేట‌, ములుగు, ఇబ్ర‌హీంప‌ట్నం, ధ‌ర్మ‌పురి, స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌, తుంగ‌తుర్తి, రాజేంద్ర‌న‌గ‌ర్‌, దుబ్బాక‌, మెద‌క్‌, పెద్ద‌ప‌ల్లి, కోరుట్ల‌,  వ‌రంగ‌ల్ ఈస్ట్‌, కొత్త‌గూడెం, నిజాబాద్ అర్బ‌న్‌, నిజామాబాద్ రూర‌ల్, మేడ్చ‌ల్‌, ప‌ఠాన్‌చెరు, జుక్క‌ల్ స్థానాల‌కు చెందిన ఆశావ‌హుల‌తో ఈ రోజు కాంగ్రెస్ వార్ రూమ్‌లో చ‌ర్చించ‌నుంది. ఒక్కొక్క జిల్లాకు గంట స‌మ‌యం స్ర్కీనింగ్ క‌మిటీ కేటాయించింది. 

సీట్ల కేటాయింపు విష‌యంలో జ‌న‌స‌మితి, సీపీఐ ఒత్తిడికి త‌లొగ్గి తెలంగాణ‌లో 119 సీట్ల‌లో 29 సీట్లను మిత్ర ప‌క్షాల‌కు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డింది. ఇప్ప‌టికే టీడీపీకి 14 స్థానాలు ఖ‌రారు చేసింది. మిత్ర ప‌క్షాల‌కు కేటాయించిన సీట్లుపోను, మిగిలిన 90 సీట్ల‌లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధ‌మైంది. అభ్య‌ర్థుల ఎంపిక పూర్తికాగానే జాబితాను విడుద‌ల చేయ‌నుంది. 

Comments