చైతు కోసం స‌మంత మ‌రో మాస్ట‌ర్ ప్లాన్‌..!

Another master plan for Samy for the chemistry ..!

చైతూని మరో మహేష్ బాబుని చేసే దిశగా సమంతా

సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలకి కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో సొంతంగా కధలు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండదు. ఖచ్చితంగా పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. చరణ్ కు చిరంజీవి, చైతూ, అఖిల్ లకు నాగార్జున ఇలా స్టోరీ సెలెక్షన్ విషయంలో వీళ్ళ పాత్ర ఉండేది. చరణ్ కు స్టోరీ సెలక్షన్ విషయంలో పరిణితి వచ్చే వరకూ మెగాస్టార్ ఇన్వాల్వ్ మెంట్ ఉండేది. ధృవ మూవీ నుంచి చిరు ఇన్వాల్వ్ మెంట్ పూర్తిగా తగ్గిపోయింది. అలానే చైతూ విషయంలో కూడా మొదట్లో అక్కినేని నాగార్జున ఇన్వాల్వ్ మెంట్ ఉండేది. ఐతే చైతూ హీరోగా నిలదొక్కుకున్న తర్వాత నాగ్ పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. కేవలం అఖిల్ పైనే ఫోకస్ చేస్తున్నారు. దీంతో చైతూ తన కధలని తానే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలా స్వతహాగా ఎంపిక చేసుకున్న కధ "రారండోయ్ వేడుక చూద్దాం". 

ఐతే, ఈ మూవీ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ లుగా నిలవడంతో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చైతూ సినిమాలు వరుసగా ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ సమంతనే అని ప్రచారం జరుగుతుంది. పెళ్లి అయినప్పటి నుంచి చైతూ సినిమాల విషయంలో సమంతా జోక్యం ఎక్కువగా ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. స్టార్ హీరోలతో వర్క్ చేసిన అనుభవం మొత్తాన్ని జోడించి చైతూని సూపర్ స్టార్ లిస్ట్ లో పెట్టాలని చూస్తున్నారట. అందుకే కధల ఎంపికలోనే కాకుండా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి బయటకి ఫస్ట్ కాపీ వచ్చే వరకూ ప్రతీ విషయంలోనూ సమ్ము ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 

అలా స్యామ్ జోక్యం వల్ల యుద్ధం శరణం గచ్చామి, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి ఇలా వరుసగా మూడు ఫ్లాపులు వచ్చాయి. దీంతో చైతూ అసంతృప్తిగా ఉన్నారట. మహేష్ బబౌ సినిమాల విషయంలో నమ్రత ఏ విధంగా ఐతే ఇన్వాల్వ్ అవుతారో, అదే విధంగా సమంతా కూడా చైతూ సినిమాల విషయంలో తలదూరుస్తున్నారట. స్టోరీని ఫైనల్ చేయడమే కాకుండా, ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని తన సలహాలు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా ఇంకా టాప్ హీరో ఇమేజ్ రాకపోవడంతో సమంత చైతూకి సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ కారణంగానే చైతూకి వరుస ఫ్లాప్ లు వస్తున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఐతే ఇంత జరుగుతున్నా నాగ్ ఏం చేయలేకపోతున్నారా అని వార్తలు వస్తున్న నేపధ్యంలో, అసలు నాగ్ సలహాలు, సూచనలు తీసుకోవడం లేదట. కేవలం ఫస్ట్‌ కాపీ రెడీ అయ్యాక మాత్రమే ఏదైనా ఉంచాలా తీసేయాలా అనే దానిపై నాగ్‌ అభిప్రాయాలను అడుగుతున్నారని, అప్పటికే మించిపోవడంతో నాగార్జున కూడా ఏమిచేయలేకపోతున్నారని టాక్. మరి చైతూ విషయంలో సమంతా జోక్యం చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
 

Comments