మహేష్ బాబు భక్తురాలు... దర్శనం కోసం వెయిటింగ్...!

Mahesh Babu's devotee ... waiting for darshan ...

మహేష్ బాబు భక్తురాలు... దర్శనం కోసం వెయిటింగ్...!

మహేష్.....ఈ పేరు వింటే ఒక వైబ్రేషన్ కలుగుతుంది. మహేష్ అందానికే కాదు, అతని యాక్టింగ్ కి కూడా ఫిదా అయిపోతారు. హాలీవుడ్ హీరోల ఫీచర్స్ తో ఇంటర్నేషనల్ స్టార్ డమ్ ఉన్న మహేష్ కు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పిచ్చ ఫాలోయింగ్ ఉంది. అలాంటి మహేష్ తో ఒక్క సెల్ఫీ దిగాలని, మహేష్ తో ఒక్కసారి మాట్లాడాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అలా ఉన్న వారిలో ఎక్కువ మంది యువతే ఉంటారు. అందమైన భామలే ఉంటారు. కానీ వందేళ్లు పైబడ్డ భామ్మ ఉంటుందని ఎవరైనా ఊహించగలరా? అది కూడా మహేష్ కు డై హార్డ్ ఫ్యాన్. మహేష్ ను చూసాకే చనిపోతా అని అనేంతగా ఆమె అభిమానం ఉంది. ఇంతకే ఆమె ఎవరో అనుకుంటున్నారా? 

ఆమె పేరు రేలంగి సత్యవతి. రాజమండ్రి సిటీ ఆర్ఐ కాలనీలో ఉంటున్నారు. వయసు 106 సంవత్సరాలు. ఇప్పటికీ ఆమె మహేష్ బాబునే ఆరాధిస్తున్నారు. సాధారణంగా ఈ ఏజ్ వాళ్ళు పాతతరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలని ఇష్టపడతారు. కానీ ఈ భామ్మ మాత్రం ఈనాటి సూపర్ స్టార్ అయిన మహేష్ బాబుని కలవరిస్తున్నారు. మహేష్ లో ఆమె ఏం చూసిందో ఏమో కానీ మహేష్ నే చూడాలని పరితపిస్తున్నారు. ఆయనతో ఒక్క సెల్ఫీ దిగాలని ఆరాటపడుతున్నారు. రీసెంట్ గా టీవీలో భరత్ అనే నేను మూవీ చూసినప్పటి నుంచి ఆమె మహేష్ ను కలవాలని పట్టుబడుతున్నారు.

 మహేష్ ఫోటోకు ముద్దులు పెడుతూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. మహేష్ ని చూసి చచ్చిపోతాను అని ఆమె అంటున్నారు. ఆమె ఆరోగ్యం కూడా బాలేదని, ఇప్పటి వరకూ మూడు సార్లు ఆపరేషన్ చేయించుకున్నారు. అయినా సరే ఆమె పట్టువదలకుండా మూడు నెలలుగా మహేష్ మహేష్ అని కలవరిస్తున్నారు. మహేష్ దర్శనం కోసం ఆమె తిండి కూడా సరిగా తినడం లేదు. ఇక చేసేదేమీ లేక కుటుంబసభ్యులు ఎలాగైనా మహేష్ ను కల్పించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. పేదవాళ్ళు కావడంతో ఆమెను మహేష్ దగ్గరకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోతున్నారు. అందుకే సోషల్ మీడియాల్లో ఆమె కోరికను పోస్ట్ చేసారు. 

కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇక చివరి ప్రయత్నంగా మీడియాని కలిశారు. అంతే ఒక్కసారిగా ఈ భామ్మ మహేష్ కు "సూపర్ సీనియర్ ఫ్యాన్" గా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయారు. "బాబు సెల్ఫీ ప్లీజ్, 106 ఏళ్ల భామ్మ గారు మీ సెల్ఫీ కోసం ఎదురుచూస్తున్నారు" అంటూ నెటిజన్లు ట్యాగ్ చేసి షేర్లు చేస్తున్నారు. ఇక 15 మంది కొడుకులు, కూతుర్లు, 15 మంది మనవళ్లు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు, ముని మనుమరాళ్ళు ఇలా కుటుంబం మొత్తం ఉన్నా ఆమె మాత్రం మన మహర్షి కోసం ఆరాటపడుతున్నారు. మరి మహేష్ బాబు ఈ భామ్మ మొర ఆలకించి అతిధిలా ఆమె ఇంటికి వెళ్తారా లేదా అనేది కామెంట్ చేయండి. 

Comments