చరణ్ భార్యకు  అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన కేటీఆర్ ! 

Charan's wife has given him the answer to Katyar!

     చరణ్ భార్యకు  అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన కేటీఆర్ ! 

           తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ రేంజ్ అంతా ఇంత కాదు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు స్టార్స్ గా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తుంటే.. మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసనమాత్రం తనకి తోచినంతలో  సోషల్ సర్వీస్ చేస్తూ తన గొప్ప తనాన్ని చాటుకుంటుంది. అలా సోషల్ సర్వీస్ లో భాగంగా  ఉపాసన కేటీఆర్ కు పెట్టిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. అంధ బాలికల హాస్టల్‌కు వార్డెన్‌గా పని చేస్తున్న శైలజా రాణి వీడియోను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. స్కూల్ కోసం గవర్నమెంట్ బిల్డింగ్ సాంక్షన్ చేసింది. దీనిపై చాలా సంతోషంగా ఉన్నాం. హాస్టల్ కోసం కూడా మంచి భవనం సాంక్షన్ చేస్తే మరింత సంతోషిస్తాని శైలజా రాణి ఆ వీడియో ద్వారా కోరారు.

          ఉపాసన ట్వీట్ చేస్తూ... ప్రియమైన తెలంగాణ ప్రభుత్వం. మీరు గొప్పగా పని చేస్తున్నారు. కానీ మీ నుంచి మరింత సహాయం అవసరం. ఈ బాలికల కోసం సహాయం చేయండి. నా వంతు సేవ నేను చేస్తున్నాను. దయచేసి వీరికి ఒక హాస్టల్ భవనం సాంక్షన్ చేయండి అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తున్న సింబల్‌తో కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. అయితే ట్విట్టర్ లో ఎప్పుడూ వ్యక్తీవ్ గా ఉండే కేటీఆర్ ఉపాసన రిక్వెస్ట్‌పై వెంటనే స్పందించాడు. ముందుగా స్కూలు భవనం మంజూరైనందుకు సంతోషంగా ఉంది. త్వరలోనే హాస్టల్ భవనం కూడా సాంక్షన్ చేస్తాం. అయితే మీరు డిసెంబర్ 11న కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు ఆగాలి అని కోరారు.

          ఇక దీపావళి సందర్భంగా ఉపాసన అంధ బాలికల కోసం కొత్త దుస్తువులను కానుకగా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ అమ్మాయిలకు సేవ చేయడం నాకు ఎంతో తృప్తినిచ్చింది. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా వీరి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. వీరి ప్రతిభ చూస్తే మీరు ఆశ్చపోవడం ఖాయం అని ఉపాసన పేర్కొన్నారు. ఇక ఒకవైపు ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉంటున్న కెటీఆర్.. ఉపాసన చేసే సోషల్ సర్వీస్ తెలుసుకునే ఆమెకి ఇచ్చినట్టు తెలుస్తుంది.  అయితే  స్కూల్ మంజూరు చేశామని తమ ఘనత చెబుతూనే.. వచ్చేసారి కూడా మేమే వస్తామని.. నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ అని చెప్పి అందరనీ ఇంప్రెస్ చేశాడు కేటీఆర్ . ఈ రెస్పాన్స్ ను చూసిన నెటిజనులు కేటీఆర్ సమయస్ఫూర్తిని .. చమత్కారాన్నీ  ఉపాసన మంచి మనసుని మెచ్చుకుంటూన్నారు.  

Comments