శంక‌ర్ ప్లాన్ అందుకోవ‌డం చాలా క‌ష్టం..!

Mask is mandatory for walking in Delhi ..!

శంక‌ర్ ప్లాన్ అందుకోవ‌డం చాలా క‌ష్టం..!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తీసిన 2.0 సినిమా రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. ఇది బాహుబ‌లి -2 సినిమాక‌న్నా భారీ బ‌డ్జెట్‌తో రూపొందింది.  బ‌డ్జెట్‌లాగే క‌లెక్ష‌న్ల‌లోను బాహుబ‌లి -2ను మించాల‌నుకుంటుంది. ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తోపాటు నిర్మాత‌ల‌కు అదే టార్గెట్‌. ర‌జనీకాంత్ సినిమాలు ఈ మ‌ధ్య స‌రిగ్గా ఆడ‌టం లేదు. క‌బాలి, కాలా, లింగా, విక్ర‌మ సింహా ఇలా చాలా సినిమాలు నిరాశ‌ప‌రిచాయి. అందులో కాలా కాస్తలో కాస్త ప‌ర‌వాలేద‌నిపించింది బ‌కా్సాఫీసు వ‌ద్ద‌. 

ఇలాంటి టైమ్‌లో ర‌జ‌నీకాంత్ సినిమా బాహుబ‌లి-2ను టార్గెట్‌గా పెట్టుకోవ‌డం విచిత్రంగానే అనిపిస్తుంది. అయితే, శంక‌ర్ బ్రాండ్ నేమ్ విల‌న్‌గా అక్ష‌య్  కుమార్ న‌టించ‌డం ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్స్‌.  ఈ సినిమాకు అయిన బ‌డ్జెట్ ఎంత అనేది ఎవ‌రూ చెప్ప‌లేక పోతున్నారు. అయితే, సినిమా మొత్తం రూ.500 కోట్లు అంటూ కొంత‌గా అతిగా చెబుతోంది.

  సినిమా బిజినెస్ కోసం ఇలా హైప్ చేస్తున్నార‌నేది అర్ధ‌మ‌వుతుంది. అయితే, ఈ సినిమా క‌లెక్ష‌న్లు బాహుబ‌లి రేంజ్‌లో రావాలి అంటే సినిమా క‌ళ్లు చెదిరే విధంగా హిట్ కావాలి. బాహుబ‌లి - 2 సినిమా స‌మ్మ‌ర్ సెల‌వుల్లో విడుద‌లైంది. 2.0కు అలాంటి సెల‌వుల సీజ‌న్ లేదు. ఆ విధంగా చూస్తే ఈ సినిమా బాహుబ‌టి -2  టార్గెట్‌ను అందుకోవ‌డం చాలా క‌ష్టం. 

Comments