శ్రీనివాసరావు అక్క రత్నకుమారి సంచలన  వ్యాఖ్యలు !

Srinivasa Rao's sister Rathnumari's sensational comments!

      శ్రీనివాసరావు అక్క రత్నకుమారి సంచలన  వ్యాఖ్యలు !
 

      జగన్ పై హత్యాయత్నం చేసిన కేసులో ప్రస్తుతం విశాఖ జైలులో శ్రీనివాస్ ను ఉంచిన సంగతి తెలిసిందే. రిమాండ్ గడువు కాలం పూర్తి అవ్వడంతో సిట్ అధికారులు శ్రీనివాస రావుని విశాఖ జైలు అధికారులకు అప్పగించారు. అయితే ఇప్పుడు శ్రీనివాస రావు బెయిల్ కోసం ఆయన లాయర్ సలీం కోర్ట్ లో పిటిషన్ వేశాడు. మరో రెండు మూడు రోజుల్లోనే శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు అవుతుందని, ఆయన తరఫున కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సలీమ్ వెల్లడించారు. 

     శ్రీనివాస రావుకి చాలా ఈజీగా బెయిల్ వస్తుంది అని నమ్మకంగా చెప్తున్నారు. తన క్లయింట్ బలహీనుడని, సాక్ష్యాలు నాశనం చేసే అవకాశం అతనికి లేదని, ఇప్పటికే కస్టడీలో తమకు తెలిసిన అన్ని విషయాలనూ  చెప్పాడు కనుక ఇక అతనికి బెయిల్ నిరాకరించే పరిస్థితి లేదన్నది వాదిస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా శ్రీనివాసరావు అక్క రత్న కుమారి మీడియా ముఖంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 
తన తమ్ముడిని అంతా కావాలని బలిచేశారంటూ.. జగన్ పై దాడి కేసులో నిందితుడు అక్క రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడిని చంపేస్తున్నారంటూ అతని సోదరి ఆవేదన వ్యక్తం చేశారు.

      జగన్ పై జరిగిన దాడి గురించి ఆమె మాట్లాడుతూ...‘‘ జగన్ పై నా తమ్ముడితో ఎవరో కావాలనే దాడి చేయించారు. ఎవరు చేయించారో చెబితే.. వాళ్లు నా తమ్ముడిని చంపేస్తామని బెదిరించి ఉంటారు. అందుకే వాడు చెప్పడం లేదేమో. డబ్బులు ఇస్తామని ఆశపెట్టి ఈ పని చేయించి ఉంటారు. దీంతో.. ఆ డబ్బుతో భూమి కొందామని అనుకొని ఉంటాడు. అందుకే వాళ్లు చెప్పినట్లు చేశాడేమో’’ అని రత్నకుమారి తెలిపారు.

         ‘‘ నా తమ్ముడి చేతిలో రూపాయి లేదు. అలాంటి వాడు ఇంతటి దారుణానికి ఒడిగడతాడని మేము ఊహించలేదు. ఈ పనికి పురమాయించిన వారు ఇప్పుడు వాడిని చంపేస్తారేమోననే భయం మా అందర్నీ వెంటాడుతోంది. నా తమ్ముడు ఇంతటి నేరం చేశాడంటే నమ్మలేకపోతున్నా. ఎవరో చేయించిన పనికి నా తమ్ముడు ఇలా బలైపోయాడు.’’నా  విశాఖపట్నం వెళ్లిన తరువాతే అలా అయ్యాడు.  నేను కళ్లారా చూసే దానిని. వాడు చిన్న ఫోన్ వాడే వాడు. మరి తొమ్మిది ఫోన్లు మార్చాడంటే నమ్మలేకపోతున్నాను. ప్రాణహాని ఉందని పోలీసులు తీసుకు వెళుతున్నప్పుడు చెబుతుంటే... టీవీల్లో చూసి మాకు గుండె ఆగినంత పనైంది.’’ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

Comments