ఢిల్లీలో వాకింగ్ చేయాలంటే.. మాస్క్ త‌ప్ప‌నిస‌రి..!

Mask is mandatory for walking in Delhi ..!

ఢిల్లీలో వాకింగ్ చేయాలంటే.. మాస్క్ త‌ప్ప‌నిస‌రి..!


ఢిల్లీలో కాలుష్యం అంత‌కంత‌కూ పెరిగిపోతుంది. దీపావ‌ళికి ముందే కాలుష్యం పెరిగిపోవ‌డంతో పండ‌గ ఎలా నిర్వ‌హిస్తార‌న్న‌దానిపై క‌న్ఫూజ‌న్ నెలకొంది. దీపావ‌ళి పండుగ అనంత‌రం కాలుష్య స్థాయి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక ఉద్యం వేళ‌ల్లో పొల్యూష‌న్ ప్ర‌భావం మ‌రింత తీవ్రంగా ఉంటుంది. మార్నింగ్ వాక్ చేయాలంటే ఎంతో స‌మ‌స్య‌గా ఉందంటున్నారు ఢిల్లీ వాసులు. 

ఢిల్లీలో వెద‌ర్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తుండ‌టంతో వారిలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుంది. ఢిళ్లీ లెవ‌ల్లో ఓజోన్ ప‌రిమాణం త‌గ్గుతుండ‌టం కార్బ‌న్ మోనాక్సైడ్ ప‌రిమాణం పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు గాలి పీల్చుకోవ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో పొల్యూష‌న్ గ‌తంతో పోల్చుకుంటే భారీగా పెరిగిందంటున్నారు స్థానికులు. ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రావాలంటేనే... శ్వాస స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయంటున్నారు.  ఉద‌యం స‌మ‌యంలో బ‌య‌ట‌కు రావొద్దంటూ అధికారులు సూచిస్తున్నా మాస్కులు ధ‌రించి వాకింగ్ చేస్తున్నామంటున్నారు. 

Comments