రాజమౌళి నిర్ణయానికి షాకైన ఎన్టీఆర్, చరణ్ ! 

NTR, Charan for Rajamouli's decision

 రాజమౌళి నిర్ణయానికి షాకైన ఎన్టీఆర్, చరణ్ ! 

       రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు ఒక సంచలనం. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన ఘనత ఆయనకే సొంతం. అందుకే అపజయం అంటే ఎరుగని ఈ దర్శక ధీరుడితో ఒక్క సినిమా అయినా చేయాలనీ హీరోలతో వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే బాహుబలి తరువాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఎదురు చూపులకు ఫుల్  స్టాప్ పెడుతూ.. మెగా నందమూరి మల్టీ స్టారర్ల ని సెట్  చేశాడు జక్కన్న. 

   అయితే రాజమౌళి తెరకెక్కించబోయే మెగా నందమూరి మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్  ముహుర్తం ఈ నెల 11న ఫిక్స్ చేశారని తెలిసిందే. 11వ తారీఖు ఉదయం 11 గంటలకు ఫిక్స్ చేశారు.  ఎన్.టి.ఆర్, చరణ్ లతో పాటుగా సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా లాంచింగ్ కు స్పెషల్ గెస్ట్ గా ఎవరు వస్తారన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యింది.


   అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్ కు అమరేంద్ర బాహుబలి  మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడన్న టాక్ వినిపిస్తుంది. బాహుబలి పుణ్యమా అంటూ.. రాజమౌళి ప్రభాస్ లు ఒక ఇంట్లో మనుషులు లాగా కలసిపోయారు. ఇక రామ్ చరణ్  ప్రభాస్ ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఎన్టీఆర్ తో ప్రభాస్ రిలేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి బృందావనం సినిమా సమయంలోనే తెలిసిందే. అప్పటి నుండి వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ ! 


   ఇలా RRR టీమ్ మొత్తం తన మనసుకి నచ్చిన వ్యక్తులే కావడంతో రాజమౌళి అడిగి అడగగానే ప్రభాస్ ఈ సినిమా ముహూర్తానికి గెస్ట్ రావడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. గతంలో తారక్.. అరవింద సమేత ఓపెనింగ్ కి పవన్  కళ్యాణ్ గెస్ట్ గా వచ్చి.. అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక అదే దారిలో ఇప్పుడు బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్  త్రిబుల్ ఆర్ సినిమాకి గెస్ట్ గా రాబోతున్నాడు. ఇలా స్టార్ హీరోల సినిమా ఫంక్షన్స్ కి మరో స్టార్ హీరోలు రావడం అన్నది పరిశ్రమకి మంచిదే అని చెప్పుకోవచ్చు .ఇక డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్స్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. 2020 సమ్మర్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Comments