పంబ నుంచి వెనుదిరుగుతున్న మ‌హిళ‌లు..!

Women leaving pumba

పంబ నుంచి వెనుదిరుగుతున్న మ‌హిళ‌లు..!

శ‌బ‌రిమ‌ల‌లో అయ్య‌ప్ప ఆల‌య  ద్వారాలు తెరుచుకున్నాయి. చిత్త‌ర తిరునాల ఉత్స‌వం సంద‌ర్భంగా ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డంతో అయ్య‌ప్ప భ‌క్తులు శ‌బ‌రిమ‌ల‌కు పోటెత్తారు. స్వామియే శ‌ర‌ణం అయ్య‌ప్పా  సేవ్ శ‌బ‌రిమ‌ల నినాదాలతో శ‌బ‌రి గిరులు మారుమోగుతున్నాయి. అయితే, సుప్రీం కోర్టు ఆదేశించినా స‌రే ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళా భ‌క్తులు అయ్య‌ప్ప ఆల‌యంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ద‌క్క‌లేదు. హిందూ ప‌రిష‌త్, శివ‌సేన వంటి సంస్థ‌లు మ‌హిళా భ‌క్తుల‌ను అడ్డుకుంటున్నారు. దీంతో శ‌బ‌రిలో ఇంకా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కొన‌సాగుతుంది.

సుప్రీం కోర్టు వ‌ర‌మిచ్చినా ఆందోళ‌న‌కారులు ఏ మాత్రం క‌నిక‌రించ‌డం లేదు. అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి వ‌స్తున్న మ‌హిళ‌ల‌ను  అడుగ‌డుగునా అడ్డుకుంటున్నారు. తాజాగా అంజు అనే 20 ఏళ్ల మ‌హిళ త‌న భ‌ర్త, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి పంబ వ‌ర‌కు చేరుకున్నారు. అయితే, ఆందోళ‌న‌ల క్ర‌మంలో ఆమె అక్క‌డ్నుంచి అర్ధాంత‌రంగా అక్క‌డ్నుంచి వెనుదిర‌గ‌క త‌ప్ప‌లేదు. ఆమె భ‌ద్ర‌త కోర‌లేద‌న్నారు పోలీసులు. ఆమె అనుమ‌తి తీసుకుని ఉంటే ఆమెకు పోలీసు ప్రొటెక్ష‌న్ క‌ల్పించేవార‌మ‌న్నారు. అంజు అర్ధాంత‌రంగా వెనుదిర‌గ‌డం ఇది రెండోసారి. 
 

Comments