టి ఆర్ ఎస్  నేత దారుణ హత్య

The murder of the TRS leader

         టి ఆర్ ఎస్  నేత దారుణ హత్య

          తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి మొదలయింది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల నగారా మ్రోగడంతో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని మరింత జఠిలం చేస్తూ.. తెలంగాణలోని  వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్లో  రాజకీయ హత్య జరిగింది. రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడేలా జరిగిన ఈ ఘటనకి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

         వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్లో దారుణం జరిగింది. తెరాస నేత నారాయణరెడ్డి దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈరోజు ఉదయం పొలానికి వెళ్తున్న నారాయణరెడ్డిపై దుండగులు దాడి చేసి రాళ్లతో తలపై కొట్టి చంపేశారు. నారాయణరెడ్డి అనుచరులుగా ఉన్న కొందరు యువకులు ఈ మధ్యే కాంగ్రెస్లో చేరారు. అప్పట్నుంచీ వారితో నారాయణరెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆ యువకులే ఆయన్ని హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఆగ్రహం చెందిన నారాయణరెడ్డి వర్గీయులు కాంగ్రెస్ నేతలపై దాడికి దిగారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడాయి.

         ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పాత కక్షలే నారాయణరెడ్డి హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే నారాయణరెడ్డి వర్గీయులు మాత్రం.. కాంగ్రెస్ లో చేరిన తమ అనుచరులను మా పైకి కాంగ్రెస్ నాయకులే ఉసిగొల్పి ఉంటారని ఆరోపిస్తున్నారు. అయితే గతంలో కూడా నారాయణరెడ్డి పై పలుమార్లు హత్యా యత్నం జరిగి ఉండటంతో పోలీసులు ముందుగా ఆ దశలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఏదేమైనా రాష్ట్రంలో ఒక అధికార పక్ష నేత హత్య.. రాజకీయ నాయకులనే కాకుండా.. సామాన్య ప్రజానీకాన్ని కూడా ఉలిక్కి పడేలా చేసింది అని చెప్పుకోవచ్చు.  

Comments