తెరాసకు జనసేన, ముందస్తు మద్దతు ఇచ్చినా...?  వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు..!

Do you have a jansea or early support for Teresa? Sensational truths to light ..

తెరాసకు జనసేన, ముందస్తు మద్దతు ఇచ్చినా...?  వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు..!

ముందస్తు ఎన్నికలు అంటూ ముందడుగు వేసింది గులాబి దండు....రండి ఎవరెంతవారో ప్రజల సాక్షిగా తేల్చుకుందాం అని సవాలు విసిరింది కారు....ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. కేసీఆర్ను  ఓడించేందుకు పార్టీలన్నీ ఏకమై మహాకూటమిగా ఏర్పడాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సారథ్యంలోని ఈ కూటమిలో టీడీపీ, సీపీఐ, టీజేఏస్, ఇతర చిన్నాచితక పార్టీలతో పొత్తులకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి.  అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో దోస్తీతో ఎన్నికల బరిలో దిగుతుండగా….బీజేపీ సొంతంగానే ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తోంది. 

ఎదిఎమైనా  తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్-టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలతో మహాకూటమిని ఏర్పాటు చేసి పొత్తు కూడా పెట్టుకోగా వైసీపీ, జనసేన, సీపీఎం పార్టీలు ఇంకా మీనమేషాలు లెక్కపెడుతున్నాయి. చూడబోతే ఈ పార్టీలు కేసీఆర్ నేతృత్వంలోని తెరాసకు మద్దతు నిచ్చే సూచనలు కనబడుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే జనసేన మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

తెలంగాణాలో మీతో జట్టు కట్టడానికి మేం సిద్ధం అని తెలంగాణా సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. ఒకవేళ పవన్ వైఖరి మరోలా ఉంటే తమకు పట్టున్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో సొంతంగా పోటీ చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. పవన్ మొదట్లో కేసీఆర్ సర్కార్ పట్ల ఎడా పెడా మాట్లాడినా, రాను రాను trs మీద అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది...తెలంగాణలో పోటీ చేస్తారు అని అనుకున్నవారికి చుక్కెదురైంది.

నిజానికి 2014 నాటి ఎన్నికల్లో మద్దతు ఇచ్చి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. ఇక మనం ఎప్పుడు ఎదగాలి? అని జనసేన నేతలు కొందరు పవన్కల్యాణ్ వద్ద వాదన లేవదీశారని తెలిసింది. పైగా వైసీపీకి మద్దతిస్తే.. జగన్ గనుక సీఎం పీఠం ఎక్కితే వచ్చే టర్మ్ కూడా మనకి కష్టమవుతుందనీ, మనకి ప్రతిపక్ష పాత్రే మిగులుతుందనీ కొందరు జనసేన నేతలు వాదిస్తున్నారు కూడా! స్వయంగా పోటీచేసి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటే కర్నాటకలో జేడీఎస్ మాదిరిగా ఏపీలో చక్రం తిప్పవచ్చునన్నది మెజారిటీ జన సైనికులు, పార్టీ నేతల వాదనగా ఉంది. ఈ వాదనపైనే ఇప్పుడు జనసేనలో చర్చలమీద చర్చలు సాగుతున్నాయి.

రెండు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ రెండు పక్షాలూ కసరత్తులు చేస్తున్నాయి. జనసేన పాత్ర కీలకంగా మారడంతో వైసీపీలోని కొంతమంది సీనియర్ నేతలు మాత్రం పొత్తు ఉండాల్సిందేననీ, లేనిపక్షంలో చంద్రబాబును కట్టడిచేయడం సాధ్యం కాదనీ అంటున్నారు...మొదట తెలంగాణలో ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కొన్నాళ్ళకు పార్టీ నిర్మాణం పూర్తికానందున ఈసారికి కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమవుతామని చెప్పారు. ఇప్పుడేమో మొత్తానికి పోటీ నుండి వైదొలిగారు. అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా బలమైన కారణం ఉంది.

తెలంగాణలో జనసేన పార్టీ కి సరైన సంస్థాగత నిర్మాణం లేదు.ఒక్కరంటే ఒక్కరు కూడా బలమైన నాయకులు లేరు. ఉన్న కొద్దిపాటి క్యాడర్ (అది కూడా ఆయన ఫ్యాన్స్) కు దిశా నిర్దేశం చేసే న్యాయకత్వం లేదు. అదీ కాక ఎన్నికలు ఊహించని విధంగా ముందస్తుగా వచ్చాయి.ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఎన్నికలకు సిద్దమవడం పోటీ చెయ్యటం అంటే అది అసాధ్యం అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే తెలంగాణా ఎన్నికలకు కామ్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

ఒకవేళ పోటీ చేసి ఓటమి పాలైతే ఆ ఫలితం రాబోయే, ప్రధాన లక్ష్యమైన ఏపీ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఊరుకున్న దాని కన్నా ఉత్తమం లేదని భావించి జనసేనాని సరైన నిరనయమే తీసుకున్నారు. ఇన్ని ఇబ్బందులున్నప్పుడు పోటీ చేయకపోవడమే మంచిదని, ఏపీ ఎన్నికలే టార్గెట్ గా ఈ సారికి ముందుకు సాగితే మంచిదని పవన్ తీసుకున్న నిర్ణయం పవన్ పార్టీ కి మేలు చేస్తుంది...అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

Comments