ఎన్టీఆర్ సినిమాలో మార్చిన డైలాగ్స్ ఇవే..!

Dialogues changed in NTR's movie ..!

ఎన్టీఆర్ సినిమాలో మార్చిన డైలాగ్స్ ఇవే..!

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర రెండు భాగాలుగా రూపొందుతుంది. మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థా నాయ‌కుడు పేరుతో, రెండో భాగం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడిగా రిలీజ్ అవుతుంది.   క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌క్కా స్ర్కిప్ట్‌తో మొద‌లు కాగా, ఇంకో నెల‌లో షూటింగ్ పూర్త‌వుతుంది. అయితే, చివ‌ర్లో స్ర్కిప్ట్‌లో మార్పులు  చోటు చేసుకున్నాయ‌ని తెలిసింది. 

వెండితెర‌ను ఏలిన తార‌క రాముడు రాజ‌కీయాల్లోనూ ప్ర‌భంజ‌నం సృష్టించారు. ఆత్మ గౌర‌వం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెల‌ల్లో అధికారం సొంతం చేసుకున్న ఏకైక నాయ‌కుడు ఎన్టీఆర్‌. ఆ నాటి క‌థ ఇలా ఉంటే.  బ‌యోపిక్ క‌థ మారుతుంది. తెలంగాణ‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం మ‌హాకూట‌మిలో చేరి  కాంగ్రెస్‌తో క‌లిసి పోటీ చేయ‌నుంది.

చంద్ర‌బాబు ఆ మ‌ధ్య‌న రాహుల్ గాంధీని క‌లిసి దేశం కోసం క‌లిసి పోరాడుతామ‌ని  పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌లో  చంద్ర‌బాబు నాయుడు పాత్ర కీల‌కం. సినిమాలో న‌టిస్తుంది బాల‌య్య‌నే కాబ‌ట్టి  బాబును పాజిటివ్‌గానే చూపిస్తారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం, కాంగ్రెస్ క‌ల‌యిక సినిమా స్ర్కిప్ట్‌ను మార్చేస్తున్నాయ‌ట‌. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా తెలుగుదేశం ఆవిర్భ‌వించిన‌ట్టు క‌థ‌లో ఉంటే తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల రీత్యా స్ర్కిప్ట్‌ను మార్చ‌నున్నార‌ని స‌మాచారం. 

ఎన్టీఆర్ బయోపిక్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన సీన్స్‌ను ద‌ర్శ‌కుడు ఆల్రెడీ బాల‌య్య‌పై తీసేశాడు. మారిన రాజ‌కీయ లెక్క‌ల నేప‌థ్యంలో ఈ సీన్ రీషూట్ చేస్తార‌నే ప్ర‌చారం న‌డుస్తుంది.  అయితే, సీన్‌ను ఒక్క‌టి కూడా మార్చ‌ర‌ని డ‌బ్బింగ్‌లో క‌వ‌ర్ చేస్తార‌ని తెలిసింది. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకం అన్న మాట ఉన్న చోట  కేంద్రానికి వ్య‌తిరేకం అన్న మాట పెడ‌తార‌ట‌. మొత్తానికి తాజా రాజ‌కీయ పరిస్థితుల ప్ర‌భావం ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై ప‌డి ఎలా వివాదాలు, మ‌లుపుల‌కు కార‌ణ‌మ‌వుతుందో చూడాలి.

Comments