అమ్మాయి ఫాద‌ర్‌కు వెంక‌టేష్ స‌వాల్‌..!

Venkatesh's daughter

అమ్మాయి ఫాద‌ర్‌కు వెంక‌టేష్ స‌వాల్‌..!

త్రినాథ్‌రావు తీసిన సినిమాల‌న్నీ ప్రేమ క‌థ‌లే. క‌థ‌నంలో కాస్త తేడా ఉన్నా  స్టోరీ లైన్ మాత్రం ఒక్క‌టే. హీరో హీరోయిన్ ఫాద‌ర్‌తో స‌వాల్ చేసి ప్రేమ‌ను ద‌క్కించుకుంటాడు. ఇదే కోవ‌లో సినిమా చూపిస్తా మావా , నేను లోక‌ల్‌, రీసెంట్‌గా వ‌చ్చిన హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రాల‌ను తీశాడు, సినిమా చూపిస్తా మావా, నేను లోకల్‌తో స‌క్సెస్‌ను చూసిన త్రినాథ్ రావు టేకింగ్ రొటీన్ కావ‌డంతో హ‌లో గురు ప్రేమ కోస‌మేతో మెప్పించ‌లేక‌పోయాడు. 

హ‌లోగురూ ప్రేమ కోస‌మే త‌రువాత త్రినాథ్‌రావు వెంక‌టేష్‌తో సినిమాకు క‌మిట్ అయ్యాడు. క‌థ న‌చ్చ‌డం, సురేష్‌బాబు ఈ మూవీని నిర్మించ‌నున్నాడ‌ని తెలిసింది. ప్రేమ క‌థ‌ల‌ను మాత్ర‌మే తీసే త్రినాథ్‌రావు వెంక‌టేష్‌తో కూడా  లవ్ స్టోరీనే తీస్తాడా.?  ఒక‌వేళ ఇదే తీస్తే 50 ప్ల‌స్ వెంక‌టేశ్ హీరోయిన్ ఫాద‌ర్‌తో స‌వాల్ విస‌ర‌డం  బాగుండ‌దు. జ‌స్ట్‌ఫ‌ర్ ఛేంజ్ కోసం వెంక‌టేష్‌నే ఫాద‌ర్ స్థానంలో నిల‌బెడ‌తాడా..?  లేదంటే డిఫ‌రెంట్ క‌థ‌తో వ‌స్తాడా..?  ఇలా కాంబినేష‌న్ చాలా ప్ర‌శ్న‌ల‌నే సృష్టిస్తోంది.

వెంక‌టేష్ ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్‌2 మూవీతో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లో నాగ‌చైత‌న్య‌తో  క‌లిసి న‌టించే వెంకీ మామ  మూవీ చిత్రం మొద‌ల‌వుతుంది. ఈ లెక్క‌న త్రినాథ్‌రావు డైరెక్ట్ చేసే మూవీ 2019 మార్చి త‌రువాత సెట్స్‌పైకి రానుంది. మొత్తానికి ఈ ఏడాది క‌నిపించ‌ని వెంకీ  2019లో మూడు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. 
 

Comments