క్యాష్ కోసం స్నేహితుడినే క‌డ‌తేర్చాడు..!

A friend is for the cash ..

క్యాష్ కోసం స్నేహితుడినే క‌డ‌తేర్చాడు..!

 

ఫ్లాట్ చూపిస్తాన‌ని తీసుకెళ్లి.. ప్రాణం తీశార‌నే కేసు మిస్ట‌రీగా మారింది. హైద‌రాబాద్ కాచీగూడ‌కు చెందిన గౌత‌మ్ అనే వ్య‌క్తి యాదాద్రి జిల్లా నంద‌నంలోని ఓ రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. విక్ర‌మ్ అనే వ్య‌క్తి త‌న‌పై పెట్రోలు పోసి నిప్పంటించాడ‌ని వాంగ్మూలం ఇచ్చాడు. ఫ్లాట్ చూపిస్తాన‌ని తీసుకెళ్లిన విక్ర‌మ్ త‌న ద‌గ్గ‌ర ఉన్న మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు తీసుకుని ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడ‌ని గౌత‌మ్ చెప్పాడు. 

వెంచ‌ర్‌లోని ఓ చిన్న గ‌దిలో  మంట‌లు ఎగిసిప‌డ‌టంతో స్థానికులు అలెర్ట్ అయ్యారు. అక్క‌డికి వెళ్లి చూస్తే గౌత‌మ్ తీవ్ర గాయాల‌తో ప‌డి ఉన్నాడు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చి అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ, ఫ‌లితం ద‌క్క‌లేదు. చికిత్స పొందుతూ గౌత‌మ్ చ‌నిపోయాడు. ఈ విష‌యం తెలిసిన ఆయ‌న బందువులు షాక్ అయ్యారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో ల‌భించిన సెల్‌ఫోన్స్ , స్కూటీ, మ‌ద్యం సీసాల‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌తో త‌న కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ చేసి స‌మాచారం అందించారు పోలీసులు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.  
 

Comments