ర‌ణ‌రంగంగా ప్ర‌కాశం జిల్లా ప‌రిష‌త్ స‌మావేశం..!

District Prakasham District Parishad Meeting ..!

ర‌ణ‌రంగంగా ప్ర‌కాశం జిల్లా ప‌రిష‌త్ స‌మావేశం..!


ప్ర‌కాశం జిల్లా ప‌రిష‌త్ స‌మావేశం గంద‌ర‌గోళంగా మారింది. లోటు బ‌డ్జెట్ కార‌ణంగా రెండేళ్ల‌పాటు  స‌భ్యుల‌కు కొత్త ప‌నులు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని సీఈవో కైలాష్‌గిరి ప్ర‌క‌టించ‌డంతో ర‌గ‌డ రాజుకుంది. జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. చైర్మ‌న్ ఏదెల హ‌రిబాబు సీవో కైలాష్ గిరి వైఖ‌రిని త‌ప్పుబ‌డుతూ విమ‌ర్శ‌లు గుప్పించారు. అజెండాలు చ‌ద‌వ‌కుండానే త‌మ ఇష్టారీతిన తీర్మానాల‌ను మినిట్స్ పుస్త‌కాల‌తో అతికిస్తున్నార‌ని ఆరోపించారు.

జ‌డ్పీ సాధార‌ణ నిధుల లోటు 9.92 కోట్లు ఉంద‌ని, గ‌తంలో సీఈవో సంత‌కం లేకుండానే తీర్మానం చేసినందున కొత్త‌గా నిధులు విడుద‌ల చేయ‌లేమ‌ని చెప్పారు ప్ర‌స్తుత సీఈవో కైలాష్‌గిరి. అయితే, ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు అడ్గు త‌గిలారు స‌భ్యులు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌రిపాల‌న జ‌రిగేలా  చూడాల్సిన బాధ్య‌త సీఈవోదేన‌న్నారు. బిల్లుల మంజూరులో చైర్మ‌న్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు ఎంపీటీసీలు. మ‌రోవైపు బ‌డ్జెట్ నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని సీఈవోపై ధ్వ‌జ‌మెత్తారు. రెండు గ్రూపులుగా విడిపోయి పోడియంను చుట్టుముట్టారు. అజెండా కాపీల‌ను విసిరేశారు. అరుపులు, కేక‌ల‌తో జ‌డ్పీ స‌మావేశం ర‌ణ‌రంగంగా మారింది.

Comments