కోదండ‌రామ్ పార్టీ ఎన్నిక‌ల గుర్తు ఇదే..!

This is the symbol of Koddadaram party election ..

కోదండ‌రామ్ పార్టీ గుర్తు ఇదే..!


మ‌హాకూట‌మిలో తమ పార్టీ టీజేఎష్ కూడా భాగ‌స్వామ్యం అయినందున త‌మ‌కు క‌చ్చితంగా ప‌ది సీట్లు ఇవ్వాల‌ని కోరిన‌ట్టు ఆ పార్టీ అధినేత కోదండ‌రామ్ తెలిపారు. కాగా, ఇవాళ టీజేఎస్ అధినేత కోదండ‌రామ్ మీడియాతో మాట్లాడుతూ త‌మ పార్టీ గుర్తు అగ్గె పెట్టె అని చెప్పారు. గుర్తుకు సంబంధించిన వివ‌రాల‌ను మీడియా ముందు ఉంచారు. ఈ సంద‌ర్భంగా కోదండ‌రామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవ‌ల కాలంలో త‌మ పార్టీ నేత‌లు కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను రెండు సార్లు క‌లిశామ‌న్నారు.

ఆదివారం కూడా క‌ల‌వాల్సి ఉన్న‌ప్ప‌టికీ వ‌రంగ‌ల్‌లో త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌న‌శ‌క్తి కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌టంతో కుద‌ర‌లేద‌ని చెప్పారు. 
ద‌స‌రా పండుగ‌కు ముందే పొత్తులో భాగంగా సీట్ల స‌ర్దుబాటు విష‌యం కొలిక్కి రావాల్సి ఉంద‌ని, క‌నీసం  దీపావ‌ళి పండుగలోగానైనా మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు విష‌యం ఓ కొలిక్కి వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని కోదండ‌రామ్ వ్య‌క్తం చేశారు. 

Comments