జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!

Jagan case case sensation .. another tension on the screen ..!

జ‌గ‌న్ కేసులో సంచ‌ల‌నం.. తెర‌పైకి మ‌రో టెన్ష‌న్‌..!


ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి కేసులో నిందితుడు నిందితుడు శ్రీ‌నివాస‌రావు త‌రుపున రెండు పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశారు. విశాఖ స్పెష‌ల్ కోర్టులో న్యాయ‌వాది స‌లీమ్ బెయిల్ పిటిష‌న్ వేశారు. దీంతోపాటు శ్రీ‌నివాస‌రావు మాన‌సిక ప‌రిస్థితిపై వైద్య స‌హాయం కోరుతూ మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. బాధితుడికి రెండో, మూడు రోజుల్లో బెయిల్ మంజూరు అవుతుంద‌ని న్యాయ‌వాది స‌లీమ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌నివాస‌రావును విచారించిన సిట్ అధికారులు మ‌రోసారి అత‌న్ని క‌స్ట‌డీకి కోర‌నున్నారు. నిందితుడి నుంచి స‌రైన స‌మాధానం రాలేద‌ని భావిస్తున్న సిట్ పూర్తి వివ‌రాల కోసం మ‌రికొంత స‌మ‌యాన్ని కోర‌నున్నారు. ఈ శుక్ర‌వారం వ‌ర‌కు శ్రీ‌నివాస‌రావు రిమాండ్ గ‌డువు ఉండ‌టంతో అదే రోజు మ‌ళ్లీ రిమాండ్ ను పొడిగించాల‌ని కోర‌నున్నారు.  మ‌రోవైపు సిట్ కూడా క‌స్ట‌డీ అనుమ‌తిపై మ‌రో పిటిష‌న్‌ను వేయ‌నుంది. ప్యాలీ గ్రాఫ్ టెస్టు కోసం పిటిష‌న్ దాఖ‌ల ఉంచేయాల‌ని సిట్ భావిస్తోంది. 

ఎయిర్‌పోర్టులో దాడి జ‌రిగిన హోట‌ల్‌ను సిట్ పోలీసులు సీజ్ చేశారు. ఎయిర్‌పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ వేణుగోపాల్ు ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఇన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌రో టెన్ష‌న్ తెర‌పైకి వ‌చ్చింది. అదే జైలు. శ్రీ‌నివాస‌రావుపై జైలులో ఎవ‌రైనా దాడి చేస్తారేమోన‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసును నీరుగార్చేందుకు, నిజాలు బ‌య‌ట‌కు రాకుండా భ‌య‌పెట్టేందుకు అత‌నిపై ఎవ‌రైనా దాడి చేస్తారేమోన‌నే అనుమానాలూ ఉన్నాయి. దీంతో శ్రీ‌నివాస‌రావును స్పెష‌ల్ వ్యాలెట్‌లో ఉంచారు.
 

Comments