చంద్ర‌బాబుది శున‌కానందం.. ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Chandrababu Sunnakandam .. MLA Roja Sensational Comments ..!

చంద్ర‌బాబుది సున‌కానందం.. ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!


ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రో పార్టీతో పొత్తు లేకుండా, ఒంట‌రిగా ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అంతేకాకుండా, ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచే సత్తా లేని నాయ‌కుడు మంత్రి నారా లోకేష్ ఉన్నార‌న్నారు. అలాంటి చంద్ర‌బాబు, లోకేష్ ఇద్ద‌రూ క‌లిసి వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఎదుర్కోలేక, వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేస్తూ జ‌గ‌న్‌పై హ‌త్య‌కు య‌త్నించార‌న్నారు. అటువంటి ఘ‌ట‌న‌పై సీరియ‌స్ ఇష్యూ జ‌రుగుఉత‌న్నా కూడా చంద్ర‌బాబు, లోకేష్ ఇద్ద‌రూ  వెట‌కారంగా మాట్లాడుతూ సున‌కానందం పొందుతున్నారంటూ.. చంద్ర‌బాబు నాయుడు సున‌కానంద పార్టీకి జాతీయ అధ్య‌క్షుడా..?  అవునా.. కాదా.. అని అడుగుతున్న‌ట్టు రోజా అన్నారు. 

జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థ‌లు చేసిన స‌ర్వేల‌న్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయ‌మ‌ని తేల్చేశాయ‌ని, ఇక ఎన్నుక‌లు జ‌ర‌గ‌డ‌మే త‌రువాయ‌ని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఆ స‌ర్వేల ఫ‌లితాల‌ను చూసి. ఓట‌మి భ‌యంతో వైఎస్ జ‌గ‌న్‌పై హ‌త్య‌కు ప్లాన్ చేశార‌ని, వైఎస్ జ‌గ‌న్ అప్ర‌మ‌త్త‌త‌తో హ‌త్య నుంచి తప్పించుకున్నార‌ని రోజా చెప్పారు. 

Comments