పటేల్ విగ్రహం వెనక దాగి ఉన్న రహస్యాలు, స్వార్ధాలు ఇవే..

These are the hidden secrets behind the statue of Patel.

పటేల్ విగ్రహం వెనక దాగి ఉన్న రహస్యాలు, స్వార్ధాలు ఇవే..

సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలియని భారతీయుడు ఉండడు....ఆయనే కనక ఆనాడు ముందడుగు వేయకపోయి ఉంటె ఈరోజు హైదరాబాద్ కి వీసా తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేది అంటే పరిస్థితి ఎంత కష్టమైందో ఊహించవచ్చు..అటువంటి చిక్కు సమస్యను కేవలం తన ఆలోచనతో దేశాన్ని ఐకమత్యం చేయగలిగాడు....ఆయన కీర్తి చరిత్రలో మరుగున పడకూడదు అని మోడీ ప్రభుత్వం ప్రపంచం లోనే అతి భారీ పటేల్ విగ్రహాన్ని నిర్మించాలని సంకల్పించింది....

కేవడియాలో ఏర్పాటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలువెత్తు విగ్రహం చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. విగ్రహం కాళ్ల దగ్గర మనిషి నిలబడితే వాళ్లు లిల్లిపుట్ లలా కనిపిస్తారు. అంత పెద్ద విగ్రహం అది. అలాంటి విగ్రహాన్ని దాదాపు నాలుగేళ్లపాటు శ్రమించి నిర్మించారు. ఆ విగ్రహం ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం. సాధు బెట్ ఐలాండ్ దీన్ని నిర్మించారు. సర్దార్ సరోవర్ డ్యామ్‌కు 3.5 కిలోమీటర్ల దూరం. వింధ్యాచల్, సాత్పూర పర్వత సానువుల మధ్య. విగ్రహ నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 2,989 కోట్లువిగ్రహం ఎత్తు,  597 అడుగులు. ఈ విగ్రహం కోసం ప్రత్యేకంగా 17వందల టన్నుల కాంస్యం, లక్షా 80వేల క్యూబిక్ మీటర్ల సిమెంట్,.. 18 వేల 5వందల టన్నుల స్టీల్ కాంక్రీట్, 6 వేల 5వందల టన్నుల స్ట్రక్చరల్ స్టీల్ వాడారు.

300 మంది ఇంజనీర్లు… 3400 మంది కార్మికులు… 3 సంవత్సరాల 9 నెలలపాటు పనిచేసి విగ్రహ నిర్మాణం చేశారు. 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినా ఈ విగ్రహం తట్టుకుంటుంది. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినా ఈ విగ్రహం చెక్కు చెదరదు. విగ్రహాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి. 320 మీటర్ల పొడవైన వంతెన లేదంటే పడవల్లోనూ చేరుకోవచ్చు. విగ్రహం ఛాతీ వరకూ రెండు లిఫ్ట్‌ల్లో సందర్శకులు వెళ్లవచ్చు. అక్కడ ఒకేసారి 200 మంది నిలుచుని పరిసరాలను చూడొచ్చు. ఒక్కో లిఫ్ట్ లో 26మంది వెళ్లే వీలుంది. కేవలం అర నిమిషంలో లిఫ్ట్ 500 అడుగులు వెళ్తుంది. ఒక మనిషి 5అడుగుల ఆరు అంగుళాలు ఉంటాడనుకుంటే.. అలాంటివాళ్లను వందమందిని నిలువునా నిలబెడితే ఎంత ఎత్తు ఉంటుందో.. అంత ఎత్తు సర్దార్ విగ్రహం ఉంటుంది.

ఈ విగ్రహం ప్రత్యేకతలు ఇలా ఉంటె,  దీని వెనక మరో స్వార్ధం కూడా దాగి ఉంది.....కాంగ్రెస్ ఎపుడో మర్చిపోయిన ఆయనను కోరి కోరి మోడీ ఆయనను బయటకు తీసి అంత పెద్ద స్థానాన్ని కల్పిస్తున్నాడంటే దానివెనక ఎదో అంతరార్ధం ఉండే  ఉంటుంది...నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరిదీ గుజరాత్ రాష్ట్రమే. దేశ తొలి హోంమంత్రి వల్లభాయ్ పటేల్, దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో గుజరాతీ నరేంద్ర మోదీ.2006 నుంచి మోదీ ప్రసంగాలను గమనిస్తే, ఆయన గుజరాత్ గురించి, సర్దార్ పటేల్ గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూ వస్తున్నారన్న విషయం అర్థమవుతుంది.

నరేంద్ర మోదీ తన ఇమేజ్ను పెంచుకోవాలంటే అందుకు ఓ బలమైన ప్రముఖ వ్యక్తి ముఖం అవసరం. అలాంటి శక్తిమంతమైన వ్యక్తి సర్దార్ పటేల్. గుజరాత్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారాయన.ఉక్కు మనిషిగా అందరికీ సుపరిచితమైన సర్దార్, క్లిష్ట పరిస్థితుల్లోనూ గట్టి నిర్ణయాలు తీసుకోవడంలో, మెరుగైన పాలన అందించడంలో ఆయనకు ఆయనే సాటి. తనలోనూ అలాంటి లక్షణాలు ఉన్నాయని చాటుకోవాలని మోదీ అనుకున్నారు. సర్దార్ హిందువు కాబట్టి ఆయనను మోదీ ఇష్టపడ్డారు. ముస్లింల పట్ల సర్దార్ పటేల్‌లో కొంతమేర అసూయ ఉండేది. అయితే, గుజరాత్ ఒక హిందుత్వ లేదా హిందూ రాష్ట్రంగా అవతరించాలని మాత్రం ఆయన ఎన్నడూ భావించలేదు. ముస్లింలు కూడా అందరితో సమానమే అన్నట్లుగా ఆయన చూసేవారు. మతం పేరుతో ప్రజలను విభజించాలని అనుకునేవారు కాదు.

ఈ విగ్రహం ద్వారా సర్దార్ పటేల్ అంతటి పేరు తనకు కూడా రావాలని, భావి తరాలు సర్దార్తో పాటు తన పేరును కూడా గుర్తుచేసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. అని కొంతమంది రాజకీయ విశ్లేషకుల ఆభిప్రాయ పడుతున్నారు.

Comments