సెల‌వుల నుంచి త‌ప్పించాలంటే త‌న కోరిక తీర్చాల్సిందే..!

To get out of vacation, his wish is to wait ..


విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఓ విద్యార్థినిప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ కీచకుడి శ‌రనుంచి త‌ప్పించుకుని క‌ళాశాల ప్రిన్సిప‌ల్‌కు ఫిర్యాదు చేసింది విద్యార్థిని. దీంతో ఆ లెక్చ‌ర‌ర్ ప‌రార‌య్యాడు. 

శ్రీ‌కాకుళం జిల్లా రాజామ‌హిళా క‌ళాశాల‌లో కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. కాలేజీలో గ‌త మూడేళ్లుగా జ్యువాల‌జీ స‌బ్జెక్ట్ విద్యార్థినుల‌కు బోధిస్తున్నాడు. ద‌స‌రా సెల‌వుల‌కు ముందు క‌ళాశాలలో అనుమ‌తులు తీసుకుని బ్యాంకు ప‌ని ఉంద‌ని బ‌య‌ట‌కు వెళ్లాడు లెక్చ‌ర‌ర్ చంద్ర‌మౌళి. అదే రోజు సెల‌వుపెట్టి ఇంటికి వెళుతున్న డిగ్రీ విద్యార్థిని అత‌నికి ఎదురుప‌డింది. మాయ‌మాట‌లు చెప్పి ఆమెను త‌న రూమ్‌కు తీసుకెళ్లాడు లెక్చ‌ర‌ర్‌.

త‌ర‌చూ సెల‌వులు పెడుతున్నావ‌ని విద్యార్థినిని బెదిరించాడు. సెల‌వుల నుంచి త‌ప్పించాలంటే త‌న కోరిక తీర్చాల‌ని లెక్చ‌ర‌ర్ చంద్ర‌మౌళి యువ‌తిని బ‌ల‌వంతం చేయ‌బోయాడు. ఒక్క‌సారిగా భ‌యంతో వ‌ణికిపోయిన విద్యార్థిని అత‌డి చెర నుంచి త‌ప్పించుకుంది. అక్క‌డ్నుంచి బ‌య‌ట‌కు వచ్చిన విద్యార్థిని నేరుగా క‌ళాశాల‌కు వెళ్లి ప్రిన్సిప‌ల్‌కు ఫిర్యాదు చేసింది. 

అయితే, విద్యార్థిని త‌న‌పై ఫిర్యాదు చేసి ఉండ‌ద‌ని భావించిన  ఆ కామాంధుడు య‌ధేచ్ఛ‌గా మ‌రుస‌టిరోజు క‌ళాశాల‌కు వ‌చ్చాడు. దీంతో ప్రిన్సిప‌ల్ జ‌రిగిన ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ అడ‌గ‌టంతో అక్క‌డ్నుంచి పారిపోయాడు. మళ్లీ క‌ళాశాల‌కు తిరిగి రాలేదు. దీంతో ఈ విష‌యంపై ప్రిన్సిప‌ల్ ఉన్న‌తాధికారుల‌పై ఫిర్యాదు చేశాడు. కీచ‌క లెక్చ‌ర‌ర్ క‌ళాశాల‌కు వ‌స్తే తాట తీయాన‌లి చూస్తున్నారు బాధిత విద్యార్థిని బంధువులు. మ‌రో వైపు క‌ళాశాల‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను  తోటి లెక్చ‌ర‌ర్లు ఖండిస్తున్నారు. 

Comments