భర్తని చంపేందుకు ఉండే ధైర్యం పెద్దలని ఒప్పించేందుకు ఎందుకు ఉండదు?

Why not convince the elders to kill a husband?

భర్తని చంపేందుకు ఉండే ధైర్యం పెద్దలని ఒప్పించేందుకు ఎందుకు ఉండదు?

పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమిస్తారు. ఇంట్లో చెప్పడానికి భయపడతారు. దీంతో ప్రేమించిన వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లయ్యాక ప్రియుడ్ని మర్చిపోలేక భర్తని చంపుతారు. ఇవీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న క్రైమ్ స్టోరీలు. కొంతమంది అమ్మాయిల పిరికితనం కారణంగా అమాయకులైన అబ్బాయిలు బలైపోతున్నారు. భర్తని చంపేందుకు ఉన్న ధైర్యం పెద్దలని ఒప్పించేందుకు ఎందుకు ఉండదో అర్ధం కాని వైనం. అప్పుడు లేని ధైర్యం పెళ్లి తర్వాత వచ్చేస్తుంది. ఆ ధైర్యంతోనే కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్నారు. మొన్నా మధ్య స్వాతిరెడ్డి అనే యువతి, తన భర్త అయిన సుధాకర్ ని ప్రియుడి సహాయంతో ఎంత ఘోరంగా చంపిందో చూశాం. తాజాగా మాలతి అనే యువతి ప్రియుడి మోజులో పడి తన భర్తని హతమార్చింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. 

మాలతి అనే యువతి బీహార్ కు చెందిన మంగల్ దాస్ ను పెళ్లి చేసుకుంది. 8 ఏళ్ల నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు. ఐతే, పెళ్ళికి ముందే నీరజ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి పార్కులు, సినిమాలు, షాపింగ్ లు అంటూ తిరిగారు. ఎంజాయ్ చేశారు. కానీ ఇంట్లో పెద్దలను ఒప్పించడానికి భయపడ్డారు. ఆ తర్వాత మాలతికి మంగల్ దాస్ తో పెళ్లైపోయింది. ఐతే, పెళ్లయ్యాక కూడా నీరజ్ తో తిరగడం, నీరజ్ తో గడపడం లాంటివి చేసేది. పెళ్ళికి ముందు ఎలా ఐతే పార్కుల వెంట తిరిగారో అలా పెళ్లయ్యాక కూడా తిరిగారు. భర్త లేని సమయంలో చాలా సార్లు ప్రియుడితో పడక సుఖాన్ని పొందేది. ఆ సుఖంలో పడి భర్తనే కడతేర్చాలనుకుంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. పక్కా స్కెచ్ తో రంగంలోకి దిగారు. 

ఒకరోజు మంగల్ దాస్ పార్టీకి వెళ్ళాడు. పార్టీకి తన భార్యను కూడా తీసుకెళ్ళాడు. ఆ పార్టీలో ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే ఆల్కహాల్ తీసుకున్నాడు. భర్తని చంపేందుకు ఇదే తగిన సమయం అనుకుని ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. అంతే ప్రియుడు వెంటనే ఆమె ఇంటికి బయలుదేరాడు. భర్త తాగి ఉండడంతో డ్రైవ్ చేయలేకపోతున్నాడు. క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేసరికి నీరజ్ అక్కడ రెడీగా ఉన్నాడు. తూలుతున్న భర్తని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి, ప్రియుడ్ని లోపలకి పిలిచింది. మత్తులో ఉన్న భర్త కాళ్ళు మాలతి పట్టుకోగా, నీరజ్ అతని గొంతు నులిమి చంపేశాడు. తాగి ఉండడంతో మంగల్ దాస్ మృత్యువు నుంచి బయటపడలేకపోయాడు. ఆ తర్వాత ప్రియుడ్ని అక్కడి నుంచి పంపించేసి ఏమీ తెలియని నంగనాచిలా ఉదయాన్నే లేచి ఏడవడం మొదలుపెట్టింది. 

దీంతో ఇంటి యజమాని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగిందని అన్నాడు. "ఏమో అండి, రాత్రి పార్టీలో మందు తాగారు. కడుపునొప్పి వస్తుంది అంటూ చాలా సేపు బాధపడి నిద్రపోయారు. పొద్దున్న లేచి చూస్తే ఉలూకూపలుకూ లేకుండా పడి ఉన్నారు" అంటూ చెప్పింది. వెంటనే అతను పోలీసులకి ఈ విషయం చెప్పాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం చేయాలని అన్నారు. దానికి ఆమె వద్దండి, పోస్టుమార్టం అంటే నా భర్తని ముక్కలు ముక్కలుగా కోస్తారు. నాకది ఇష్టం లేదు. వదిలేయండి" అంటూ ఏడ్చింది. కానీ పోలీసులు వినలేదు. ఫార్మాలిటీ అంటూ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఐతే, పోస్టుమార్టంలో తేలింది ఏమిటంటే, అతను కడుపునొప్పితో చావలేదు, ఎవరో హత్య చేశారు అని. దీంతో పోలీసులకి అనుమానం వచ్చి ఆమెని విచారించారు. కడుపు నొప్పితో చనిపోయాడని అంటున్నారు, కానీ ఎలాంటి నొప్పి లేదని అన్నారు పోలీసులు. 

"నిజం చెప్పు, శిక్ష తగ్గిస్తాం. లేదంటే మా పద్ధతుల్లో విచారించి నిజాలు బయటకి రప్పిస్తాం. అప్పుడు శిక్ష కఠినంగా ఉంటుందని" భయపెట్టడంతో మాలతి జరిగింది చెప్పింది. తనకు నీరజ్ అనే వ్యక్తితో  సంబంధం ఉందని, ఇద్దరం ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నామని తెలిపింది. అతనితో కలిసుండాలనే ఉద్దేశంతోనే తన భర్తను ఇద్దరం కలిపి చంపామని వెల్లడించింది. దీంతో పోలీసులు మాలతిని, నీరజ్ ను అరెస్ట్ చేశారు. తమ కొడుకు మరణంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక అమ్మాయి పిరికితనం కారణంగా ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రేమిస్తే సరిపోదు, ఇంట్లో వాళ్ళని ఒప్పించే ధైర్యం కూడా ఉండాలి. ఒప్పుకోకపోతే ఒప్పుకునే వరకూ వెయిట్ చేయాలి. లేదంటే పెళ్లి చేసుకున్న వాళ్లతోనే అడ్జస్ట్ అవ్వాలి. తప్పదు. లేదంటే అందరి జీవితాలూ నాశనమవుతాయి. ప్రేమ వల్ల అటు మంగల్ దాస్ ప్రాణాలు పోయాయి. ఇటు మాలతి, నీరజ్ ల జీవితాలూ నాశనమయ్యాయి. 

జీవితాలని బలి కోరుకునే ఇలాంటి ప్రేమలు అవసరమా? అయినా పెళ్లయ్యాక భర్తని చంపేందుకు ఉండే ధైర్యం పెళ్ళికి ముందు తమ ప్రేమని ఒప్పించే ధైర్యం ఎందుకు ఉండదు? ఈ ధైర్యం అప్పుడే చూపించి ఉంటే ఈ పరిస్థితి రాదు కదా. మరి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి మహిళల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఈ విషయంలో తప్పెవరిది? తమ ప్రేమని పెద్దలు ఒప్పుకోరేమో అని భయపడి చెప్పలేకపోతున్న అమ్మాయిలదా? చెప్పినా ఒప్పుకోని పెద్దలదా? లేక చెప్పే ధైర్యం లేక తలొంచుకుని పెళ్లి చేసుకునే అమ్మాయిలదా? తప్పెవరిదో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Comments