తన భార్యను ప్రెండ్ తో ఒక రాత్రి వెళ్ళమన్నాడు.. ఎందుకో తెలిస్తే..?

He asked his wife to go with a friend for a night.

తన భార్యను ప్రెండ్ తో ఒక రాత్రి వెళ్ళమన్నాడు.. ఎందుకో తెలిస్తే..?

పెళ్ళంటే ఏడడుగులతో మొదలై, ఆరు కాలాల పాటు చల్లగా ఉండాలి అనే కమిట్ మెంట్ తో, పంచభూతాల సాక్షిగా, నాలుగు వేదాల నడుమ, మూడు ముళ్ళ బంధంతో రెండు నిండు జీవితాలు ఒకట్టయ్యే అరుదైన ఘట్టం. అలాంటి ఘట్టంలో భర్త, భార్యకి కష్టాల్లోనూ, సుఖాల్లోనూ తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాడు. కానీ కొంతమంది భర్తలు మాత్రం చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి భార్యలను ప్రమాదంలోకి నెట్టేస్తారు. ఈ కోవకి చెందిన వాళ్ళే ముంబైకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు. నాలుగేళ్ల క్రితం ఈ అన్నదమ్ములిద్దరూ ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. ఎవరి భార్యలతో వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. ఇద్దరూ వేరు వేరు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

ఐతే, అన్నయ్యకి ఒక ఆలోచన పుట్టింది. ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తమ్ముడికి చెప్పాడు. ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చారు. ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలనుకున్నారు. దాని కోసం పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలా అని ఆలోచించారు. తమ భార్యలని అడిగి చూశారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఐతే, అప్పుడే ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ గా ఉన్న ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు. ఆ అప్పుతో బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ లాభం రాలేదు. దీంతో మరింత అప్పుల్లో కూరుకుపోయారు. అప్పు ఇచ్చిన వాడు ఇస్తారా, చస్తారా అంటూ బెదిరిస్తున్నాడు. 

అప్పుడు ఆ అన్నదమ్ములు తమ భార్యలతో "చెరో 5 లక్షలు మీ ఇంట్లో వాళ్ళను ఇవ్వాల్సిందిగా" అన్నారు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ పేదవాళ్లు. అయినా వీళ్ళు చేసిన తప్పుకు వాళ్లెందుకు శిక్ష అనుభవించాలి అని అనుకుని ఉండచ్చు. ఇక పెళ్ళాలు తమ మాట వినడం లేదని అర్ధమయ్యింది. వెంటనే ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి "ఎంత ప్రయత్నించినా మా వల్ల కావడం లేదు. మాకు ఎవరూ డబ్బు ఇవ్వమంటున్నారు. కొన్ని రోజులు టైమ్ ఇస్తే తీర్చేస్తాం" అన్నారు. దానికి అతను "అప్పు తీర్చక్కర్లేదు" అంటూ ఇద్దరికీ షాక్ ఇచ్చాడు. "కానీ మీ భార్యలని ఒక్కరోజు నాతో పంపిస్తే చాలు" అని అడిగాడు. దానికి ఆ అన్నదమ్ములిద్దరూ గంగిరెద్దుల్లా తలాడించారు. ఒక్కరోజు కళ్ళు మూసుకుంటే అప్పు తీరిపోతుందని ఆలోచించారు కానీ, తమ జీవితాలే నాశనం అవుతున్నాయని ఊహించలేదు. 

అలా ఫ్రెండ్ అన్న మరుక్షణమే వాళ్ళ భార్యలని రెడీ అవ్వమని చెప్పి ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చారు. పార్టీ ఉందని అబద్ధం చెప్పి తీసుకెళ్లి వాళ్ళని బలవంతంగా ఫ్రెండ్ గదిలోకి పంపించారు. అన్నదమ్ములిద్దరూ బయట పీకలదాకా తాగి నిద్రలోకి జారుకున్నారు. గదిలో అక్కాచెల్లెళ్ళు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఇద్దరూ కలిసి ఆ వ్యక్తిపై దాడి చేశారు. దీంతో అతని తలకి గాయమైంది. మరుసటి రోజు ఆ మహిళలిద్దరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో తమ భర్తలిద్దరితో పాటు వాళ్ళ ఫ్రెండ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ అక్కాచెల్లెళ్ళు అమ్మా, నాన్నల దగ్గర ఉంటున్నారు. 

అయినా అప్పు చేస్తే ఏదోలా కష్టపడి తీర్చుకోవాలే కానీ ఇలా పెళ్లాన్ని పక్కలోకి పంపించడం ఏంటి? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ సమాజం ఇలా ఏడ్చింది. మరి ఇలాంటి సన్నాసి భర్తలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలానే "భర్త అంటే పెళ్ళిలో చేసిన ప్రమాణాన్ని మర్చిపోకుండా భార్యకి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా కాపాడేవాడే" అనే మా ఉద్దేశాన్ని లైక్ చేసి షేర్ చేయండి.

Comments