మెడికల్ కమిటీకి చుక్కలు చూపించిన నిరుపేద విద్యార్ధి

Poor student who has shown dots to the Medical Committee


లక్ష్యాన్ని చేరుకోవాలానే ధృఢమైన సంకల్పం ఉండాలే కానీ అంగవైకల్యం కూడా అడ్డుపడదని నిరూపించాడో విద్యార్ధి. జీన్స్ లోపం వల్ల అతను బరువు, ఎత్తు పెద్దగా పెరగలేదు. ఐతే ఏంటి, అనుకున్నది సాధించడంలో, దాని కోసం దేన్నైనా ఎదిరించడంలో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు. తాను డాక్టర్ అవ్వాలంటే అంగవైకల్యం అడ్డుగా ఉందని చెప్పిన వాళ్ళకి బుద్ధి చెబుతూ సీటు ఇవ్వను అన్న చోటే మెడికల్ సీట్ సంపాదించి వార్తల్లో నిలిచాడు. త్వరలోనే డాక్టర్ గా మనముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఆ వ్యక్తి కధేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

గుజరాత్ లోని బావ్ నగర్ కు చెందిన గణేష్ చాలా బాగా చదువుతాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న కుటుంబం కావడంతో, కష్టం విలువ తెలుసుకున్న గణేష్ కష్టపడి చదువుతూ వచ్చాడు. అలా చదువుతూనే డాక్టర్ అవ్వాలనే గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. దాని కోసం నీట్ ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ తెచ్చుకున్నాడు. తనకు అడ్మిషన్ ఇవ్వమని వెళ్ళిన ప్రతిచోటా తిరస్కారానికి గురయ్యాడు. బాగా చదువుతాడు, మంచి స్కోర్ కూడా వచ్చింది, డాక్టర్ అవ్వాలన్న లక్ష్యం ఉంది. అయినా సరే అతనికి సీట్ ఇవ్వడానికి నిరాకరించింది మెడికల్ కమిటీ. దానికి కారణం అంగవైకల్యమే అని తేల్చి చెప్పింది. 

17 ఏళ్లకి ఏ కుర్రాడైనా 40 కేజీల నుంచి 60 కేజీల బరువుతో, 5 అడుగుల నుంచి 6 అడుగుల వరకూ ఉంటాడు. కానీ 17 ఏళ్ల గణేష్ మాత్రం 14 కిలోల బరువుతో కేవలం మూడు అడుగుల ఎత్తు ఉన్నాడు. దీంతో ఇతను 72 శాతం వికలాంగుడు అన్న ముద్ర వేశారు. ఈ కారణంగానే ఎమర్జన్సీలో ఇతని సేవలు ఉపయోగపడవని మెడికల్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో నిరుత్సాహపడ్డ ఆ కుర్రాడికి ఏం చేయాలో అర్ధం కాలేదు. డాక్టర్ అవ్వాలన్న తన కల కలగానే మిగిలిపోతుందేమో అని బాధపడ్డాడు. ఆర్ధికంగా వెనుకబడిన తన కుటుంబానికి అండగా నిలబడాలన్న తన ఆశయం ఆవిరైపోయిందని ఆవేదన చెందాడు.

 ఇక తాను లైఫ్ లో డాక్టర్ కాలేమోనని కాలేజ్ కాంపౌండ్ లో ఒక చోట కూర్చుని ఏడుస్తున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక ప్రొఫెసర్ గణేష్ ని చూసి దగ్గరకు వచ్చాడు. విషయం తెలుసుకుని అతనికి దారి చూపించాడు. నీ చదువు ముందు, డాక్టర్ అవ్వాలన్న నీ సంకల్పం ముందు అంగవైకల్యం చాలా చిన్నది. లే, నాతోరా. కోర్టులో కేసు వేద్దాం అంటూ ఆ కుర్రాడికి దేవుడి రూపంలో దారి చూపించాడు. ఆ ప్రొఫెసర్ సాయంతో గణేష్, గుజరాత్ హైకోర్టులో తన వాదన వినిపించాడు. కేవలం హైటు, వెయిటు లేని కారణంగా తనకు కాలేజ్ లో అడ్మిషన్ ఇవ్వడం లేదంటూ మొరపెట్టుకున్నాడు. కానీ మానవత్వం లేని హైకోర్టు గణేష్ వాదనని కొట్టిపడేసింది. 

కనీస ఎత్తు, బరువు లేకుండా డాక్టర్ అవ్వడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చింది. దీంతో నిరాశ చెందిన గణేష్, సుప్రీంకోర్టులో తన ఆవేదన వ్యక్తం చేశాడు. అంగవైకల్యం తన శరీరానికే కానీ, బుద్ధికి కాదని, డాక్టర్ ఐతే తాను డాక్టర్స్ గర్వించే విధంగా అత్యున్నతమైన వైద్యసేవలు అందిస్తానని, దాని కోసం తనకు అడ్మిషన్ ఇప్పించాల్సిందిగా సుప్రీంకోర్టు జడ్జ్ ని కోరాడు. దీంతో గణేష్ మాటలకు చలించిన ఆ జడ్జి గణేష్ కు మద్ధతుగా తీర్పునిచ్చారు. దీంతో ఆ మెడికల్ కమిటీకి కళ్ళు బయర్లుగమ్మినంత పనయ్యింది. గణేష్ కు అడ్మిషన్ ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పడంతో, భయపడిన కమిటీ అతనికి అడ్మిషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. అతని సంకల్పం ముందు అంగవైకల్యం పెద్ద లోపమా అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అతనికి అడ్మిషన్ దొరికింది. బాగా చదువుకోవాలనే తపన, గొప్ప లక్ష్యం ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలే కానీ వాళ్ళు వికలాంగులు అని ముద్ర వేస్తూ నిరుత్సాహపరచకూడదు. 

గణేష్ త్వరలోనే డాక్టర్ అవ్వాలని, మెరుగైన వైద్యం అందిస్తూ దేశంలోనే గర్వించతగ్గ డాక్టర్ అవ్వాలని కోరుకుందాం. మరి గణేష్ కు అడ్మిషన్ ఇవ్వాలని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుపై, డాక్టర్ అవ్వాలన్న గణేష్ పట్టుదలపై, అలానే గణేష్ కు సాయం చేసిన ఆ ప్రొఫెసర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే "పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అంగవైకల్యం అడ్డుకాదు" అని చెప్పిన ఈ కుర్రాడి సంకల్పానికి ఒక లైక్  ఇవ్వండి. "లోపం ఉందని బాధపడకుండా మాకో లోకం ఉంది, అందులో ఒక లక్ష్యం ఉంది. దాన్ని సాధించేవరకూ పోరాడుతూనే ఉంటాం" అని తోటి వికలాంగులకి చాటి చెప్పిన గణేష్ వ్యక్తిత్వాన్ని పదిమందికి షేర్ చేయండి. ఇలాంటి సామాజిక దృక్పధం ఉన్న వీడియోల కోసం మా చానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి.

Comments