మాన‌సిక స్థైర్యం కోల్పోయిన ప్ర‌తీ ఒక్క‌రు త‌ప్ప‌క చ‌ద‌వాల్సిన ఆర్టిక‌ల్‌..!

Everyone who has lost mental stability must read the article!

మాన‌సిక స్థైర్యం కోల్పోయిన ప్ర‌తీ ఒక్క‌రు త‌ప్ప‌క చ‌ద‌వాల్సిన ఆర్టిక‌ల్‌..!

ఇటీవ‌ల కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంద‌ని, అందులోను యువ‌త సంఖ్య‌నే ఎక్కువ ఉంద‌ని ఇటీవ‌ల ప‌లు సంస్థ‌లు జ‌రిపిన స‌ర్వేలు వెల్ల‌డించాయి. అంతేకాకుండా, కుటుంబ స‌మ‌స్య‌లు, ప్రేమికుల మ‌ధ్య త‌లెత్తిన వివాదాలతో బాధ‌ను భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నవారు కొంద‌రైతే, త‌మ‌పై తాము న‌మ్మ‌కాన్ని కోల్పోయి ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారు మ‌రికొంద‌ర‌ని స‌ర్వే పేర్కొంది. 

అలా ఆత్మ‌హ‌త్య చేసుకునే వారు ఒక్క సెక‌న్ ముందు  ఆలోచించాల‌ని, త‌మ భ‌విష్య‌త్ గురించి ఆలోచించిన ప్ర‌తీ ఒక్క‌రు ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌ను మార్చుకుంటార‌ని మాన‌సిక వైద్యులు చెబుతున్నారు. అంతేగాక‌, త‌మ‌పై త‌మ‌కు న‌మ్మ‌కాన్ని, స్ఫూర్తిని క‌లిగించే పుస్త‌కాలు ఎన్నో ఉన్నాయ‌ని, ఆ పుస్త‌కాల‌ను చ‌దివి సారాంశాన్ని అర్థం చేసుకోగ‌లిగితే జీవితంలో స‌గం విజ‌యం సాధించిన‌ట్టేన‌ని మేధావులు చెబుతున్న మాట‌.

అయితే, ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని య‌త్నించిన వారికి కెన్యా దేశానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఏంజెల్ వంజీర్ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఏంజెల్ వంజీర్ త‌న త‌ల్లి గ‌ర్భం నుంచే పెద్ద త‌ల‌తో ప్ర‌పంచంలోకి అడుగుపెట్టింది. పెద్ద త‌ల‌తో జ‌న్మించిన ఏంజెల్ వంజీర్‌ను చూసిన వైద్యులు ఒకింత షాక్‌కు గుర‌య్యారు. కానీ, త‌నకు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి మాత్రం ఎంతో సంతోషంగా త‌న పొత్తిళ్ల‌లో ప‌డుకోబెట్టుకుని త‌న ప్రేమ‌ను కురిపిస్తూ ఐ ల‌వ్యూ.. ఐల‌వ్యూ.. ఐ ల‌వ్యూ అని ప‌దే ప‌దే చెబుతూ ముర్రుపాలు ఇవ్వ‌సాగింది.

ఏంజెల్ వంజీర్‌కు కాస్త ఊహ తెలిసిన త‌రువాత త‌న ఇంటి ఆరుబ‌య‌ట ప్రాంతంలోని పిల్ల‌ల‌తో క‌లిసి ఆడుకునేది. కానీ, ఏంజెల్ వంజీర్‌ను చూసిన తోటి పిల్ల‌లు మాత్రం త‌న త‌ల‌ను చూసి న‌వ్వ‌డం ప్రారంభించారు. వారు ఎందుకు న‌వ్వుతున్నారో తెలీని ఏంజెల్ వంజీర్ ఒక రోజు త‌న త‌ల్లిని ప్ర‌శ్నించింది. నాతో ఆడుకునే వారు న‌న్ను చూసి న‌వ్వుతున్నార‌మ్మా..!  ఎందుకు..? అంటూ ప‌దే ప‌దే ప్ర‌శ్నించ సాగింది. కానీ, త‌న త‌ల్లి మాత్రం నీ త‌ల అంద‌రిలా కాకుండా పెద్ద‌దిగా ఉంద‌ని చెప్ప‌లేక, ఐ ల‌వ్యూ అంటూ పాట‌పాడి త‌న‌ను డైవ‌ర్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నించేది అంటూ చెప్పింది ఏంజెల్ వంజీర్‌.

తన‌ను తాను అద్దంలో చూసుకున్న ప్ర‌తీసారి.. త‌న రూపం త‌న‌కే న‌చ్చేది కాద‌ని, దానికి కార‌ణం త‌న స్నేహితుల‌కంటే తాను భిన్నంగా ఉండ‌ట‌మేనని చెప్పుకొచ్చింది. అయినా, అద్దంలో త‌న రూపాన్ని చూసుకుని.. తాను ఎప్పుడూ కూడా త‌న మాన‌సిక స్థైర్యాన్ని కోల్పోలేద‌ని చెప్పింది. త‌న త‌ల్లి ఇచ్చిన ధైర్యంతో త‌న 12వ ఏట‌నే సంగీతంలో ప్రావీణ్యం సాధించిన‌ట్టు వివ‌రించింది ఏంజెల్ వంజీర్‌. సంగీతంలో ప్రావీణ్యం సాధించిన తాను 2016లో త‌న మొద‌టి పాట‌ను పాడి విడుద‌ల చేశానంటూ చెప్పుకొచ్చింది. త‌న పాట‌కు శ్రోత‌ల నుంచి ప్ర‌శంస‌లు అందాయ‌ని, అవి త‌న‌కు ఆనందాన్ని ఇచ్చాయ‌ని చెప్పుకొచ్చింది ఏంజెల్ వంజీర్‌. 

Comments