వేధింపుల‌కు బ‌లి..!

Sacrifice for harassment ..!

వేధింపుల‌కు బ‌లి..!

హైద‌రాబాద్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో ఓ వైద్యురాలి మృతి క‌ల‌క‌లం రేపుతోంది. భ‌ర్త, అత్త మామ‌ల వేధింపులే కార‌ణ‌మా..?  లేక ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా..? ఈ కోణంలో లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు అల్వాల్ పోలీసులు.  మృతురాలి కుటుంబ స‌భ్యులు జ‌య‌శ్రీ మృతిపై చాలా అనుమానాల‌నే వ్య‌క్తం చేస్తున్నారు.

 హైద‌రాబాద్ శివారు ఆల్వాల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని వెస్ట్ వెంక‌టాపురంలో వైద్యురాలు జ‌య శ్రీ అనుమానాస‌ప‌ద మృతిపై పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. అక్టోబ‌ర్ 30వ తేదీన వైద్యురాలు జ‌య శ్రీ గుండె ఆగిపోయేలా మందులు మింగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. జ‌య‌శ్రీ మృతికి అత్తా, మామ‌ల వేధింపులే కార‌ణమా..? ల‌ఏక మ‌రేమైనా కార‌ణం ఉందా..? అన్న కోనంలో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

వెస్ట్ వెంక‌టాపురంలో నివసించే  గంగిశెట్టి కార్తీక్‌, సూర్యాపేట జిల్లా కోద‌డ‌కు చెందిన కంభంపాటి జ‌య‌శ్రీ చైనాలో ఎంబీబీఎస్ చ‌దువుతుండ‌గా  ప్రేమించుకున్నారు. ఇద్ద‌రి కులాలు వేరైనా.. ఎద్ద‌ల అంగీకారంతో 2015లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి స‌మ‌యంలో రూ.25 ల‌క్ష‌ల క‌ట్నం. 45 తులాల బంగారు న‌గ‌లు, రెండు కిలోల వెండి ఆభ‌ర‌ణాల‌తోపాటు గృహాలంక‌ర‌ణ సామాన్ల‌ను అందించారు జ‌య శ్రీ కుటుంబ స‌భ్యులు. 

అయితే, నూత‌న జంట హ‌నీమూన్ కోసం విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఆ ఖ‌ర్చుల పేరుతో జ‌య‌శ్రీ‌పై అత్తారింటి నుంచి వేధింపులు ప్రారంభ‌మ‌య్యాయి. కులం పేరుతో అత్త భానుమ‌తి. మామ రాజేశ్వ‌ర‌రావు ధూషిస్తూ ఇంట్లో వివ‌క్ష చూపేవారు. దీంతో కార్తీక్‌, జ‌య శ్రీ దంప‌తులు వేరు కాపురం పెట్టి ప్రైవేటు వైద్యులుగా చేస్తున్నారు. అయినా కుటుంబంలో క‌ల‌హాలు త‌గ్గ‌క‌పోగా.. మ‌రింత ఎక్కువ‌య్యాయి. 

బుధ‌వారం అర్థ‌రా్త‌రి రెండు గంట‌ల స‌మ‌యంలో జ‌య‌శ్రీ అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉంద‌ని గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స ఇప్పిస్తున్నామ‌ని జ‌య‌శ్రీ మామ రాజేశ్వ‌ర‌రావు కోదాడ‌లోని ఆమె కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. వారు ఆస్ప‌త్రికి చేరుకునే స‌మ‌యానికి జ‌య శ్రీ మృతి చెందింది. కూతురు జ‌య శ్రీ మృతి చెంద‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. జ‌య‌శ్రీ మృతిపై ఆమె త‌ల్లిదండ్రులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అద‌న‌పు క‌ట్నంతో వేధించ‌డంతో త‌మ కుమార్తె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ఆరోపిస్తున్నారు. పోలీసులు ద‌ర్యాప్తు చేసి నిందితులు కఠినంగా శిక్షించాల‌ని కోరారు. 

Comments