వందకు పైగా సినిమాల ర‌చ‌యిత చోరీ కేసులో అరెస్ట్

More than a hundred films have been arrested in the case of Chori

వందకు పైగా సినిమాల ర‌చ‌యిత చోరీ కేసులో అరెస్ట్


సినీ గేయ ర‌చయిత కుల శేఖ‌ర్ మ‌రో కేసులో ఇరుక్కున్నాడు. దొంగ‌త‌నం కేసులో బంజారాహిల్స్ పోలీసులు అత‌న్ని అరెస్టు చేశారు. దేవాల‌యాల్లో పూజారుల క‌ళ్లుగ‌ప్పి శ‌ఠ‌గోపాలు, వారి సెల్‌ఫోన్లు, డ‌బ్బులు చోరీ చేస్తున్న అత‌గాడ్ని క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. 

విశాఖ‌కు చెందిన తిరుమ‌ల ప‌ల్లెర్ల‌మూడి కుళ‌శేఖ‌ర్ కొన్నాళ్లుగా హైద‌ర‌బాద్ మోతీన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నాడు.  కొంత‌కాలంగా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో చోరీల‌కు పాల్ప‌డ‌టం మొద‌లు పెట్టాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరాన‌గ‌ర్‌లో ఉన్న అమ్మ‌వారి ఆల‌యంలో పూజారి బ్యాగ్ మాయ‌మైంది. దీంతో పోలీసులు సీసీ కెమెరా పుట‌జ్ ఆధారంగా కుల‌శేఖ‌ర్‌ను అదుపులోకి తీసుకుని విచారించి అత‌నే ఆ దొంగ‌త‌నం చేసిన‌ట్టు నిర్ధారించారు. అటు గ‌తంలో దేవాల‌యంలో చోరీ చేసిన కేసులో ఆరు నెల‌ల జైలు శిక్ష అనుభ‌వించాడు కుల‌శేక‌ర్‌. అత‌ని నుంచి రూ.50 వేలు విలువ చేసే ప‌ది సెల్‌ఫోన్లు, రూ.40 వేల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. 

ఇక కుల‌శేఖ‌ర్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే వంద‌కుపైగా సినిమాల‌కు అత‌ను పాట‌లు రాశాడు. డైరెక్ట‌ర్ తేజ‌, ఆర్పీ ప‌ట్నాయ‌క్ కాంబినేష‌న్‌లో ఎన్నో హిట్ సాంగ్స్ రాసిన ట్రాక్ రికార్డ్ ఉంది. సంతోషం, ఘ‌ర్ష‌ణ‌, ప్రేమ లేఖ, ఫ్యామిలీ స‌ర్క‌స్, చిత్రం, జ‌యంతి, వ‌సంతం, యువ‌రాజు, ఇంద్ర ఇలా వంద సినిమాల‌కు పైగా పాట‌లు రాశాడు. అయితే, కొన్నేళ్లుగా అవ‌కాశాలు దూర‌మై చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌య్యాడు.  కుటుంబ స‌భ్యుల‌కు కూడా దూర‌మ‌య్యాడు. 2016లో కాకినాడ‌లోని ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో శ‌ఠ‌గోపం చోరీ చేశాడు. ఆ కేసుకు సంబంధించి ఆరు నెల‌ల‌పాటు జైలు శిక్ష అనుభ‌వించాడు. 

Comments