చోక్సీ, నీర‌వ్ మోడీ ప‌రారీ వెనుక కేంద్ర మంత్రి జైట్లీ ప్రమేయం

Jaitley involved behind Chopra and Nirav Modi

చోక్సీ, నీర‌వ్ మోడీ ప‌రారీ వెనుక కేంద్ర మంత్రి జైట్లీ ప్రమేయం

17 వేల కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణంలో నిందితుడు పారిపోవ‌డానికి కేంద్ర ఆర్థిక మంత్రి కార‌ణ‌మ‌ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో మోహ‌ల్ చాక్సీ విదేశాల‌కు పారిపోవ‌డం వెనుక జైట్లీ హ‌స్త‌ముంద‌ని, జైట్లీ కుమార్తె  సోనాలీ జైట్లీ జాక్సీ లాయ‌ర్ కావ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జోక్సీ అకౌంట్ నుంచి జైట్లీ కుమార్తె సోనాలీ జైట్లీకి డ‌బ్బులు అందాయ‌ని, ఏ అకౌంట్ నుంచి.. ఏ అకౌంట్‌కు డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయో అన్న విష‌యాన్ని కూడా రాహుల్ గాంధీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

పీఎన్‌బీ స్కామ్ బ‌య‌ట‌ప‌డ‌టానికి సోనాలీ జైట్లీకి భారీ మొత్తంలో నిధులు ముట్టాయ‌ని, మిగిలిన సంస్థ‌లపై దాడులు చేసిన సీబీఐ జైట్లీ కుమార్తె సంస్థ‌ల‌లో ఎందుకు సోదాలు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. జైట్లీ కుమార్త‌కు, నీర‌వ్ మోడీ సంస్థ‌ల‌కు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి భారీ మొత్తంలో న‌గ‌దు అందింద‌ని ఆరోపిస్తూ అకౌంట్ నెంబ‌ర్‌ను కూడా ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు  రాహుల్ గాంధీ. ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రాకుండా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చార‌ని కానీ, ప్ర‌జ‌లు ఈ విషయం గురించి తెలుసుకోవాల‌ని  పేర్కొన్నారు. 
 

Comments