ద‌ర్శ‌కుడి చెంప‌ను చెల్లుమ‌నిపించిన హీరోయిన్‌..!

The heroine of the director's cheeks

త‌న‌ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడి చెంప‌ను చెల్లుమ‌నిపించింది సినీ న‌టి  గీతికా త్యాగి. బాలీవుడ్‌లో వ‌చ్చిన జాలీ ఎల్‌.ఎల్‌.బీ ద‌ర్శ‌కుడు సుభాష్ క‌పూర్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని గీతిక ఆరోపించింది. ద‌ర్శ‌కుడు శుభాష్ మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తార‌ని, బాలీవుడ్‌లో అత‌నికి పేరుంద‌ని గీతిక పేర్కొంది.

అయితే, శుభాష్ నిజ స్వ‌రూపం ఇదీ అంటూ అతనికి సంబందించిన ఓ వీడియోను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసింది. శుభాష్ క‌పూర్ ఎలాంటి వాడో చెప్ప‌డానికి గీతిక అత‌న్ని, అత‌ని భార్య డింపుల్‌ను ఓ స్టూడియోకు ర‌మ్మ‌న్నారు. ఆ స‌మ‌యంలో శుభాష్ త‌న భార్య‌కు జ‌రిగిందంతా చెబుతూ త‌న త‌ప్పేమీ లేదంటూ సంజాయిషీ ఇస్తున్న‌ట్టు వీడియోలో క‌నిపించింది.

మ‌రొక ప‌క్క ద‌ర్శ‌కుడు శుభాష్ క‌పూర్ చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలేనంటూ న‌టి గీతిక త్యాగి బోరున విల‌పించారు. భార్య ప‌క్క‌న ఉండ‌గానే, గీతిక అత‌ని చెంపను చెల్లుమ‌నిపించింది. ఈ దృశ్యం అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చింది. శుభాష్ త‌న భార్య ముందు ఏదో చెబుతున్న వీడియో గీతిక ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. అయితే, ఆ వీడియోలో అత‌న్ని కొట్టిన‌ట్టు ఉన్న దృశ్యాల‌ను తొల‌గించిన‌ట్టు తెలుస్తుంది. శుభాష్ ను న‌టి గీతిక కొట్టిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.
 

Comments