ద‌మ్ము, ధైర్యం ఉంటే నాముందుకొచ్చి మాట్లాడండి..!

Dummies and courage

ప్ర‌ణ‌య్‌, అమృత. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో వీరి పేరు తెలియ‌ని వారంటూ ఎవ‌రూ ఉండ‌రు. న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో చోటు చేసుకున్న ప్ర‌ణ‌య్ దారుణ హ‌త్యా ఘ‌ట‌నే ఇందుకు కార‌ణం. త‌న కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుని.. త‌న నుంచి దూరం చేశాడ‌న్న కోపంతో అమృత తండ్రి మారుతీ రావు ప్ర‌ణ‌య్‌ను హ‌త్య చేయించాడు. ఆపై మారుతీరావుకు జైలు శిక్ష ప‌డ్డ విష‌యం తెలిసిందే.

అయితే, ఇదే విష‌యంపై ప‌లు మీడియా ఛానెళ్లు తెలుగు రాష్ట్రాల్లో డిబేట్‌లు నిర్వ‌హించాయి. ప్రేమ పెళ్లిల్లు గొప్ప‌వా..?  అరేంజ్డ్ మ్యారేజెస్ గొప్ప‌వా..? అని. ఈ డేబ‌ట్ల‌లో కొంద‌రు అమృత‌కు మ‌ద్ద‌తు తెలుప‌గా.. మ‌రికొంద‌రు మారుతీరావుకు త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. మారుతీ రావుకు మ‌ద్ద‌తు తెలిపే వారు మాట్లాడుతూ..  స్కూళ్లకు వెళ్లే స‌మ‌యంలో ప్రేమ‌, పెళ్లి ఏమిట‌ని..? అస‌లు వాటి గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని..? ప‌్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మ‌రో ప‌క్క జీవితాంతం క‌లిసి ఉండ‌బోయే వ్య‌క్తిని తామే ఎంచుకుని పెళ్లి చేసుకోవ‌డంలో త‌ప్పేముందంటూ స‌మాధానం ఇవ్వ‌డం అమృత‌కు మ‌ద్ద‌తు తెలిపేవారి వంతైంది. అంతేకాకుండా, అమృత‌ను వ్య‌తిరేకించే వారంతా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలాన్ని ఉప‌యోగిస్తూ కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. ఇలా త‌న‌పై అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంలో ధూషిస్తూ కామెంట్లు చేస్తున్న వారిపై అమృత ఫైర్ అయింది. అలాంటివారికి ద‌మ్ము, ధైర్యం ఉంటే త‌న ముందుకొచ్చి మాట్లాడాల‌ని హెచ్చ‌రించింది అమృత‌.
 

Comments