మీ టూ ఉద్య‌మంపై అన‌సూయ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Anusive sensational comments on your toe movement ..!

మీ టూ అనేది ఒక మాట‌కాదు. మృగాళ్ల ఆకృత్యాల‌పై మహిళ ఎక్కుపెట్టిన తూటా. త‌మ జీవితాల్లోని చీక‌టి క‌థ‌ల‌ను ధైర్యంగా చెప్పుకునే ఓ వేదిక‌. హాలీవుడ్‌లో మొద‌లైన ఈ మీటూ ఇప్పుడు టాలీవుడ్ వ‌ర‌కు చేరింది. ఈ ఉద్య‌మానికి క్ర‌మంగా మ‌ద్ద‌తు పెర‌గ‌డంతో ఇన్నాళ్లు తెర వెనుక దాగి ఉన్న నిజాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ స్పందించింది.

అయితే, తాజాగా మీ టూ ఉద్య‌మంపై స్పందించిన యాంక‌ర్ అన‌సూయ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వేధింపులు ఉన్నాయ‌ని తెలిస్తే అక్క‌డి నుంచి జారుకోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని తెలిపింది. అటువంటి వాతావ‌ర‌ణంలో ఉండ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని సూచించింది. కొంత మంది మీటూ ఉద్య‌మాన్ని ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని చెప్పింది. దీనివ‌ల్ల నిజంగా బాధితులైన మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చ‌ని చెప్పింది. చిన్న వాటిని కూడా పెద్ద వాటిని చేయొద్ద‌ని చెప్పింది అన‌సూయ‌.

Comments