నాకు ఏదైనా అవుతే ముందు వచ్చేది సునిలే | NTR Relation about Sunil

                     నాకు ఏదైనా ఐతే సునీలే ఫస్ట్ వస్తాడు

                ఇండస్ట్రీలో డైరెక్టర్లకి, హీరోలకి మంచి స్నేహం ఉన్నట్టే, హీరోలకి, కమెడియన్లకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. దీనికి పవన్, అలీల స్నేహమే మంచి ఉదాహరణ. ఇప్పుడు ఈ బాటలోనే ఎన్టీఆర్, సునీల్ లు ఉన్నట్టు తెలుస్తుంది. "అరవిందసమేత వీరరాఘవ" మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు ఎన్‌టి‌ఆర్. సునీల్ తో తాను తక్కువ సినిమాలే చేశాను, కానీ తనతో పరిచయం మాత్రం చాలా రోజుల నుంచి ఉందని అన్నారు. సునీల్ తనకు చాలా మంచి మిత్రుడని, రేపొద్దున్న కష్టకాలంలో ఫోన్ చేస్తే ఫస్ట్ వాలిపోయే ఫ్రెండ్ అని అన్నారు. ఇక సునీల్ ని కమెడియన్ అన్నందుకు ఎన్‌టి‌ఆర్, తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "సునీల్, బ్రహ్మానందం వంటి వాళ్ళు కామెడియన్లు కాదని, వాళ్ళంతా గొప్ప నటులని అన్నారు.

             నవరసాలూ పండించగల సామర్థ్యం వాళ్లకు ఉందని అన్నారు. ఐతే నవరసాల్లో మిగతా రసాల్ని వదిలేసి, వాళ్ల నుంచి నవ్వురసాన్ని మాత్రమే తీసుకుంటున్నామని తారక్ అన్నారు. తెలిసో, తెలియకో వాళ్లకు కామెడీ పాత్రలు మాత్రమే ఇచ్చి వాటికే పరిమితం చేశామని అన్నారు. బ్రహ్మానందం కరుణ రసాన్ని కూడా అద్భుతంగా పండించగలరని, బాబాయ్ హోటల్లాంటి సినిమాలు అందుకు నిదర్శనమని అన్నారు. అలాగే లిటిల్ సోల్జర్స్సినిమాలో సరేలే ఊరుకో పాటలో బ్రహ్మానందాన్ని చూస్తే తనకు కన్నీళ్లు వస్తాయన్నారు. సునీల్ కూడా అంతే అని, అన్ని రసాలూ బాగా పండించగలడని అన్నారు. అరవింద సమేతలో సునీల్ పాత్ర చాలా బాగుంటుందని చెప్పారు. ప్రధానంగా కామెడీనే చేసినప్పటికీ, వేరే రసాల్ని కూడా పండించాడన్నారు. హీరోకు అండగా నిలిచే పాత్ర అతడిదని, కథలో కీలకంగా ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు. సినిమాలో లానే , నిజ జీవితంలో కూడా సునీల్, ఎన్‌టి‌ఆర్ కు అండగా నిలబడతారు అని చెప్పి స్నేహం యొక్క గొప్పతనాన్ని చాటారు. 

Comments