వ్యవసాయరంగాన్ని ఎంచుకున్న చిరు కారణం మహేశ్.......? Small farm selected Small reason Mahesh .....?

 farm selected  Small reason Mahesh .....?

            వ్యవసాయరంగాన్ని ఎంచుకున్న చిరు కారణం మహేశ్.......? 

                ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "సైరా నరసింహారెడ్డి" మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చిరు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఈ మూవీ తర్వాత చిరంజీవి రైతుగా మారబోతున్నారు. కొంపతీసి చిరంజీవి సినిమాలు మానేయడం లేదు కదా అని మాత్రం అనుకోకండే. ఎందుకంటే, ఆయన రైతుగా మారుతున్నది నిజజీవితంలో కాదు, సినిమాలో. కొరటాల శివ డైరెక్షన్ లో త్వరలో మెగాస్టార్ ఓ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఐతే ఈ మూవీలో చిరు రైతు పాత్ర పోషించనున్నారు. స్వచ్చమైన పల్లెటూరి నేపధ్యంలో సాగే ఈ మూవీలో చిరు, వ్యవసాయం చేయడానికి రెడీ అయిపోతున్నారు. పంచె కట్టుకుని, నెత్తిన తలపాగ చుట్టి పొలంలో ట్రాక్టర్ నడపనున్నారు. ఐతే, చిరు కోసం ఉన్నట్టుండి కొరటాల ఈ రైతు కాన్సెప్ట్ ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే దానికి కారణం మహేశ్ నటించిన "భరత్ అనే నేను" మూవీ.

           ఈ మూవీలో ట్రాఫిక్ సమస్యలు, రాజకీయనాయకుల నుంచి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు వంటి వాటి గురించి ప్రస్తావించారు కానీ,  రైతులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి చూపించలేదు. అన్ సీన్ వీడియోస్ అంటూ యూ ట్యూబ్ లో కొన్ని వీడియోస్ పెట్టారు నిర్మాతలు. వాటిలో ఒకే ఒక్క సీన్ ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అనే అంశాన్ని చూపించారు. ఐతే, ఈ సీన్ మూవీలో లేదు. నిడివి కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సీన్ ని తొలగించారు. కానీ ఇప్పుడు ఈ సీన్ ని సినిమాగా డెవలప్ చేస్తున్నారట కొరటాల. రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్యలను ఈ మూవీలో చూపిస్తారట. ఈ మూవీకి రైతు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. "భరత్ అనే నేను" మూవీని మించిన బ్లాక్ బస్టర్ అవ్వాలని చాలా జాగ్రత్తగా కధ రాసుకుంటున్నారట. దాని కోసం మూవీకి కావాల్సిన అన్ని రకాల విషయాల్ని మెగాస్టార్ తో నేరుగానే చర్చిస్తున్నారు. చిరు ఇచ్చే సలహాల్ని, సూచనల్ని తీసుకుంటున్నారు.

        ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రారంభం కానుందని, మార్చి లేదా ఏప్రిల్ 2019లో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు సాధ్యమైనంత తొందర్లోనే మొదలు పెడతారని కొణిదెల కాంపౌండ్ లో చర్చించుకుంటున్నారు. మరి, మహేశ్ ని డైనమిక్ సిఎంగా చూపించి ఔరా అనిపించిన కొరటాల చిరుని రైతుగా చూపించి ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి. చిరు, 

Comments