ఫామ్ హౌస్‌లో ముసుగేసుకుని మందుకొట్టే ఏకైక సీఎం కేసీఆర్‌..!

Only KCR is the only one that can be used in the farmhouse.

ఫామ్ హౌస్‌లో ముసుగేసుకుని మందుకొట్టే ఏకైక సీఎం కేసీఆర్‌..! నేను చిన్న‌ప్ప‌ట్నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేల‌ను చూశా, కానీ కేసీఆర్ లాంటి నీచ‌పు పాల‌న సాగించే ఎమ్మెల్యేను ఇంత వ‌ర‌కు చూడ‌లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తాజా, మాజీ ఎమ్మెల్యే బాబు మోహ‌న్‌. కేసీఆర్ టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బాబు మోహ‌న్ ఆ త‌రువాత బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా, బాబు మోహ‌న్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నేను నా చిన్న‌ప్ప‌ట్నుంచి ఎంతో మంది ముఖ్య‌మంత్రుల‌ను చూశాను. కానీ, కేసీఆర్ లాంటి నీచ‌పు పాల‌నను సాగించే ముఖ్య‌మంత్రిని చూడ‌లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌కే కాకుండా, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీల‌కు, ప్ర‌జ‌ల‌కు క‌న‌ప‌డ‌కుండా, సెక్ర‌టేరియ‌ట్‌కు రాకుండా, ఫామ్‌హౌస్‌లోనే ఉంటూ, మ‌ద్యం సేవిస్తూ పాల‌న సాగించ‌డం ఒక్క కేసీఆర్‌కే కుదిరింద‌న్నారు.

సెక్ర‌టేరియ‌ట్‌కు రాని కేసీఆర్ ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతున్నాడా..? అంటే అదీ లేదు. మొన్న‌టికి మొన్న కొండ‌గ‌ట్టు ప్రాంతంలో బస్సు లోయ‌లోప‌డి ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు చ‌నిపోతే, క‌నీసం ప‌రామ‌ర్శించ‌డానికి కూడా స‌మ‌యంలోని ముఖ్య‌మంత్రి మ‌న‌కు అవ‌స‌ర‌మా..? అంటూ ప్ర‌శ్నించారు బాబు మోహ‌న్‌. మ‌రోప‌క్క కొంద‌రు రౌడీలు న‌డిరోడ్డుపై క‌త్తులు ప‌ట్టుకుని తిరుగుతూ హ‌త్య‌లు, మాన‌భంగాల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని, కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే ఇటువంటివి పేట్రేగిపోతున్నాయ‌ని చెప్పారు. లాండ్ ఆర్డ‌ర్ ఎంత ఘోరంగా విఫ‌ల‌మైందో ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో చోటు చేసుకున్న హ‌త్య‌లే అందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు బాబు మోహ‌న్‌.

Comments