ఈ చిన్నపని చేస్తే చాలు కష్టాలు పోయి అష్టఐశ్వర్యాలు కలుగుతాయి| Importance of Dasara | Dasara Special

            దసరా లోపాలు ఈ వీడియో చూస్తే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం !

            ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగల్లో విజయదశమి ఒకటి. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలపి దసరా అంటారు. ఈ పండుగ ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు.మన దేశంలో కోల్కతా కాళీ ఉత్సవాలు ప్రసిద్ధి చెందినవి. తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల బొమ్మలతో కొలువు ఏర్పాటు చేసి పేరంటాలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. అయితే ఈ 9 రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కొలుస్తారు. అయితే వీటిలో మొదటిరోజు అమ్మవారు స్వర్ణ కవచ అలంకార రూపంలో ఉండగా పూజలు చేస్తాం. అయితే ఈ రూపం యొక్క విశిష్టతని తెలిపే ఓ కధ ప్రాచుర్యంలో ఉంది. పురాణాల్లోని ఈ కధని విన్నా, చదివినా, తెలుసుకున్నా జన్మజన్మాల పాపం తొలగి..ఈ నవరాత్రులు ముగిసేలోపే వారి దరిద్రం పోయి వారి కోరికలు నెరవేరుతాయి అని పురాణాలలో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందుకే ఇప్పుడు ఆ మహత్కరమైన కధ ఏమిటో తెలుసుకుందాం. 

             పూర్వ కాలంలో దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ దేవుడు కోసం ఈ రాక్షసుడు తపస్సు చేయగా.. అతని తపస్సుని మెచ్చి బ్రాహ్మ ప్రత్యక్షమై.. ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అయితే దుర్గముడు దానికి స్వార్ధంగా ఆలోచించి.. వేదములు అన్ని నా వశమై.. దేవతలను నేను జయించాలి అన్న కోరిక కోరుతాడు. మాట ఇచ్చిన బ్రహ్మ మాట తప్పలేక అతనికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే భూమి మీద పండితులు వేదాలు మర్చిపోవడంతో ప్రాణి జీవక్రియ ఆగిపోతుంది. నీరు ఇంకిపోతుంది. ఆహారపదార్ధాలు అస్సలు తుడిచి పెట్టుకొనిపోతాయి. సమస్త ప్రాణ కోటి విలవిలలాడిపోతుంది. ఇక దుర్గముడి రాక్షస చర్యలకి దేవతలు సైతం ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో మరో మార్గం లేక శక్తి స్వరూపమైన అమ్మ వారిని తల్లి నువ్వే దిక్కు.. లోకాన్ని కాపాడమ్మా అంటూ వేడుకుంటారు. 

           అప్పుడు అమ్మవారు.. ఒంటి నిండా కన్నులతో ప్రత్యక్షం అవడంతో ఆమెకి శతక్షి అని పేరు పెట్టారు. అమ్మవారిని చూడగానే అంతా తమ గొడ్డుని ఆమెకి చెప్పుకోసాగారు. అప్పుడు అమ్మవారు బాధపడకండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాయడానికి నేను ఒంటి నిండా కన్నులు పెట్టుకొని ఉన్నాను.. ఈ అమ్మ ఉండగా బిడ్డలకి ఎలాంటి కష్టం రానివ్వదు అని అభయం ఇస్తుంది. అప్పుడు దేవతలు అంతా భూమి మీద జీవక్రియ ఆగిపోయింది. ఎక్కడా ఆహరం లేదు, నీటి జాడ అసలే లేదు. ప్రజలు అల్లాడిపోతున్నారు అని చెప్పగా.. అప్పుడు అమ్మవారు అనంతమైన తన శక్తితో భూమి పై యధావిధి పరిస్థితులను తీసుకొచ్చేసింది. నదులు మళ్ళ్లీ జలకలతో నిండిపోయాయి. రాజ్యాల భాండాగారాలు సిరి సంపదలతో, ఆహార ధాన్యాలతో నిండిపోయాయి.ఇక వేదాలను తిరిగి దేవతల వశం చేయడానికి అమ్మవారు దుర్గముడితో 11 రోజుల పాటు యుద్ధం చేసి.. దుర్గముడిని అంతం చేస్తుంది. ఆ తరువాత వేదాలను తిరిగి దేవతలకి అప్ప చెప్తుంది అమ్మవారు. అమ్మ ఇలా అడిగిన వెంటనే ఆ రూపంలో వచ్చి అందరిని కాపాడింది కనుక నవరాత్రులలో అమ్మవారిని పూజించి ఈ కధ విన్నా, చదివినా, తెలుసుకున్నా, నలుగురికి తెలియాచేసినా, వారికి జన్మజన్మాల పాపా ఫలితాలు తొలగి.. వారు కోరుకున్న కోరికలు నవరాత్రులు గడిచే లోపలే నిరవేరుతాయి. కాబట్టి.. ఇంతటి విశిష్ఠతమైన విషయాన్ని మీరు తెలుసుకోవడమే కాక, పది మందికి తెలియచేసి అద్భుతమైన ఫలితాన్నీ పొందండి. 

Comments