ఈ నెల 12న ఓట‌ర్ల జాబితా విడుద‌ల చేయొచ్చు :హైకోర్టు

The list of voters will be released on 12th of this month: High Court

తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దును స‌వాల్ చేస్తూ మాజీ మంత్రి డీకే అరుణ‌తో పాటు శ‌శాంక్‌రెడ్డి వేసిన పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పును రిజ‌ర్వులో పెట్టింది. ఈ నెల 12న ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేయొచ్చ‌ని సూచించింది. ఓట‌ర్ల జాబితాపై అఫిడ‌విట్ ను దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఓట‌ర్ల జాబితా పిటిష‌న్‌పై విచార‌ణ ఈ నెల 12కు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

అంత‌కు ముందు, ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌కలు జ‌రిగాయ‌న్న పిటిష‌న్‌పై హైకోర్టులో వాడీవేడీ చర్చ‌లు జ‌రిగాయి. యంగ్ ఓట‌ర్స్ త‌రుపు న్యాయ‌వాది నిరూప్‌రెడ్డి వాద‌న‌ల‌ను వినిపిస్తూ  ఆరు నెల‌ల స‌మ‌యం ఉన్న‌ప్పుడు మూడు నెల‌ల్లోగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న ప‌ట్టుద‌ల ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఎలక్ర్టోర‌ల్ ప్రొసీజ‌ర్ రెడీ కాకుండా ఎన్నిక‌లు ఎలా పెడ‌తార‌ని నిల‌దీశారు. తెలంగాణ స‌భ‌కు గౌర‌వం ఉండాల‌న్న‌దే త‌మ అభిలాష అని ఆయ‌న అన్నారు. 

20 ల‌క్ష‌ల ఓట్లు త‌గ్గితే  ఏపీకి త‌ర‌లిపోయాయ‌ని అంటున్నార‌ని, కానీ, ఏపీ ఓట‌ర్ల లిస్టులో `17 ల‌క్ష‌ల ఓట్లు త‌గ్గిన విష‌యాన్ని గుర్తు చేశారాయ‌న‌. తాము నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే వెళుతున్న‌ట్టు ఈసీ స్ప‌ష్టం చేసింది. స‌భ ర‌ద్ద‌య్యాక వీలైనంత త్వ‌ర‌గా ఎన్నిక‌లు జ‌ర‌పాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని చెప్పింది. 

Comments