అమృత‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో తిట్టిన వ్య‌క్తి అరెస్ట్‌..!

Amrita impersonated a man who committed suicide

అమృత, ప్ర‌ణ‌య్ ఇటీవ‌ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయిన పేర్లు. అంతేకాకుండా, వీరిద్ద‌రిపై పోస్ట్ అయిన వీడియోస్‌ సైతం సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతూ.. ట్రెండింగ్‌లో నిలిచాయి. దీనికంత‌టికీ కార‌ణం, ప్ర‌ణ‌య్‌ను తాను పెళ్లి చేసుకున్న అమృత తండ్రి మారుతీరావు దారుణంగా హ‌త్య చేయించ‌డ‌మే. మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ఈ హ‌త్యా ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల‌నే ఒక్క కుదుపు కుదిపేసింది. దీంతో ప్రేమ పెళ్లే ఇందుకు కార‌ణ‌మ‌ని కొంద‌రు.. కాదు.. కాదు ప్ర‌ణ‌య్ ద‌ళితుడు కాబ‌ట్టే అత‌న్ని హ‌త్య చేయించార‌ని మ‌రికొంద‌రు ఇలా వారి వారి అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. 

ఇలా సోస‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియోల‌పై కొంత‌మంది నెటిజ‌న్లూ స్పందిస్తూ ప్ర‌ణయ్ భార్య అమృత‌పై అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడారు. ఇలా అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండ‌టంతో విసిగిపోయిన అమృత పోలీసుల‌కు ఈ విష‌యంపై ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈశ్వ‌ర్ (25) అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ అనంత‌రం అరెస్టు చేశారు. ఇక‌పై, త‌న‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య ప‌ద‌జాలంతో కామెంట్లు పెడితే పోలీసు స్టేష‌న్‌లో ఊచ‌లు లెక్క‌బెట్ట‌డం ఖాయ‌మంటూ హెచ్చ‌రించింది అమృత‌.

Comments