అంద‌మైన ముఖం కావాలంటే.. ఇలా చేయండి..!

Beautiful face .. do this ..

                      ఈ నాడు యువ‌త న‌ల్ల‌మ‌చ్చ‌ల కార‌ణంగా ఎంతో ఆత్మ‌నూన్య‌త‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ న‌ల్ల మ‌చ్చ‌లు సూర్య‌ర‌శ్మి కార‌ణంగానే కాకుండా, నిద్ర త‌క్కువైనా.. లేక స‌రైన స‌మ‌యానికి భోజ‌నం లేక‌పోయినా, దుమ్ము, ధూళిలో తిరుగుతూ ఉన్నా, ఎండ‌లో ఎక్కువ సమయం ఉన్నా, మెల‌నిన్ కార‌ణంగానూ ముఖం మీద ఈ న‌ల్ల‌ని మ‌చ్చ‌లు వ‌చ్చేస్తూ ఉంటాయి. మ‌రి, వీటిని తొల‌గించ‌డానికి ఎన్నో కెమిక‌ల్స్‌తో కూడిన క్రీముల‌ను, లోష‌న్స్‌ను వాడుతున్నారు. అలా కాకుండా ఇంట్లోనే ఒక చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని పాటించిన‌ట్ల‌యితే, అతి త్వ‌ర‌గా న‌ల్ల మ‌చ్చ‌ల‌తో క‌మిలిపోయిన మీ ముఖ చ‌ర్మం అందంగా మారిపోతుంది.

                    ఈ చిట్కాను త‌యారు చేసేందుకు మ‌న‌కు కావాల్సింది నిమ్మ‌కాయ‌లు. ముందుగా నిమ్మ‌కాయను క‌ట్‌చేసుకుని గింజ‌లు తీసేసి ఒక బౌల్‌లోకి ర‌సాన్ని పిండాలి. ఈ ర‌సంలో దూదిని ముంచి ప‌ది నుంచి 15 నిమిషాల స‌మ‌యం వ‌ర‌కు మొఖ‌మంతా మ‌సాజ్ చేయాలి. అలా మ‌సాజ్ చేసిన త‌రువాత 15 నిమిషాల‌పాటు ఆర‌నివ్వాలి. అలా ఆరిన త‌రువాత చ‌ల్ల‌ని శుభ్ర‌మైన నీళ్ల‌తో క‌డిగేయాలి. ఒక‌వేళ మీ చ‌ర్మం సున్నిత‌మైన‌దే అయితే నిమ్మ‌ర‌సాన్ని డైరెక్టుగా అప్లై చేయ‌కుండా రోజ్ వాట‌ర్ కానీ, శుభ్ర‌మైన మంచినీళ్లు కానీ, మిక్స్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది.

Comments