అమావాస్య రోజు ఎన్నికలు...ఐతే ఏంటి? లక్కీనంబర్ 6&7 The election on the new moon day ... what No Tension

 The election on the new moon day ... what No Tension

            అమావాస్య రోజు ఎన్నికలు...ఐతే ఏంటి? నో టెన్షన్ రా భయ్

              తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ను ప్రకటించేసింది. డిసెంబర్ 7న తెలంగాణాతోపాటు రాజస్థాన్‌ లో ఓటింగ్ జరగనున్నట్టు ప్రకటించింది. కేసీఆరే గెలుస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం టెన్షన్ పడుతున్నారట. దీనికి కారణం డిసెంబర్ 7వ తేదీ, అదేరోజున అమావాస్య కావడం. ఈ రెండూ కేసీఆర్ ని తెగ ఇబ్బంది పెడుతున్నాయట. కేసీఆర్ కి నంబర్ 6 అంటే పిచ్చి సెంటిమెంట్. దానికి తగ్గట్టే సెప్టెంబర్ 6 వ తేదీన అసెంబ్లీని రద్దు చేశారు. ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసిన రోజునే కేసీఆర్ ఓ మాట అన్నారు. న‌వంబ‌ర్ 24న ఎన్నిక‌లు ఉంటాయ‌ని, డిసెంబ‌ర్ 5న ఫ‌లితాలుంటాయని, 6న ప్ర‌మాణ‌స్వీకారం ఉంటుందని కేసీఆర్ అన్నారు. అంతేకాదు, 1+0+5 టోటల్ 6 వచ్చేలా...105 మంది అభ్యర్ధులని కూడా ప్రకటించారు. దీన్ని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు, కేసీఆర్ కి నంబర్ సెంటి మెంట్ ఎంతలా ఉందోనని. అలాంటిది తాను అనుకున్న రోజున రోజున పోలింగ్ జరక్కపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. దీనికి తోడు, అదే రోజు అమావాస్య కావడం మరింత కలవరపెడుతుందట.

            ఆరోజు కేసీఆర్ అడుగైనా బ‌య‌ట‌పెట్ట‌రు. ఎంత పెద్ద ప‌ని ఉన్నా, వాయిదా వేసుకుంటారు కానీ ఏ ప‌నీ చేయ‌రు. అలాంటిది తన ఓటు తనకే వేసుకోలేనంతగా అమావాస్య సెంటిమెంట్ కేసీఆర్ ని బంధించేసింది. డిసెంబరు 6వ తేదీన మధ్యాహ్నం 11గంటల 59 నిమిషాలకు అమావాస్య మొద‌లై, డిసెంబరు 7వ తేదీన మధ్యాహ్నం 12.16 గంటలకు పోతుంది. స‌రిగ్గా అమావాస్య నాడే అంటే డిసెంబరు 7నే ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సో...అమావాస్య నాడు పోలింగ్. కేసీఆర్ అడుగు కూడా బ‌య‌ట‌పెట్ట‌రు. కేసీఆర్ ఈ నంబర్ సెంటిమెంట్ ని, జాతకాలని బాగా నమ్ముతారు. దానికి తగ్గట్టే సెప్టెంబర్ 6 న అసెంబ్లీని రద్దు చేయడం కానీ, 105 మంది అభ్యర్ధులని ప్రకటించడం కానీ, నవంబర్ 24 న ఎన్నికలు వస్తాయని కాన్ఫిడెంట్ గా చెప్పడం కానీ ఇవన్నీ జాతకాల నుంచి వచ్చిన భయంతో కూడిన ఒక రకమైన సెంటిమెంట్ నుంచి వచ్చినవి. ఆ పండితులు ఏం చెప్తే అది చేస్తారు. వాటి కోసం బాగా ఖర్చు పెడతారు. యజ్నాలు, యాగాలు చేయిస్తారు అని కేసీఆర్ ని విమర్శించేవాళ్లు లేకపోలేదు. అయినా కేసీఆర్ ఎవరినీ పట్టించుకోరు. తాను అనుకున్నదే చేస్తారు. అలాంటిది ఇప్పుడు ఏం చేసినా తనకి అనుకూలంగా లేదని బాధపడుతున్న కేసీఆర్ కి,  పండితులు శుభవార్త చెప్పారు. ఎలక్షన్ షెడ్యూల్‌ ను ముహూర్తాల కోణంలో చూస్తే, పోలింగ్ జరిగే డిసెంబర్ 7న అమావాస్య వస్తోంది. అదే రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఇది కేసీఆర్ కు జన్మతార అవుతుంది.

            ఇక డిసెంబర్ 11 న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అంటే ఆరోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఇది ఆయనకు క్షేమతార. కాబట్టి ఎన్నికలు అమావాస్య రోజున జరిగినా, నక్షత్రబలం కేసీఆర్‌ కు కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, డిసెంబర్ 7 పోలింగ్ తేదీ అయినప్పటికీ, పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించిన డిసెంబర్ ఆరే మెయిన్ అని, నంబర్ ఆరు ఆయనకు లక్కీ నంబరే కదా అని చెబుతున్నారు. దీంతో కేసీఆర్ కి అమావాస్య సెంటిమెంటు, నంబర్ సెంటిమెంట్ టెన్షన్ తప్పిందట. ఈరోజుల్లో కూడా సెంటిమెంట్స్ ఏంటి? ఒక సిఎం స్థాయి ఉన్న కేసీఆరే ఇలా ఆలోచిస్తే ఎలా? తన లక్కీనంబర్ రోజున పోలింగ్ పెడితే, కేసీఆర్ కి ఓట్లు వేయకూడదు అని అప్పటి వరకూ అనుకున్న వాళ్ళు ఆరోజున మనసు మార్చుకుని వేస్తారా? ఏమో ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సెంటిమెంట్స్ పక్కన పెడితే, తెలంగాణ సీఎంగా మళ్ళీ కేసీఆర్ వస్తారా? రారా? కేసీఆర్ కాకుండా ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా?

Comments