ATM లో డబ్బులు రావట్లేదని వెళ్లిపోతున్నారా?  మీ డబ్బులు జాగ్రత్త?Go to the ATM? Beware of your money?

Go to the ATM? Beware of your money?ATM CASH WITHDRAWAL FRAUD ~ BEWARE!

                  ATM లో డబ్బులు రావట్లేదని వెళ్లిపోతున్నారాఅయితే మీ డబ్బులు జాగ్రత్త?

                    పాతరోజుల్లో లుంగీ కట్టుకుని, మీసాలు, గడ్డాలు పెంచుకుని, చేతిలో కత్తి పట్టుకుని జనాన్ని బెదిరించి డబ్బులు దోచుకునే దొంగలు ఇప్పుడు లేరు. ఇప్పుడంతా టెక్నాలాజీ దొంగలే ఎక్కువైపోయారు. మాఫియా సినిమాల్లో డాన్ లని చూసి దొంగలు కూడా సాంకేతికంగా అప్ డేట్ అవుతున్నారు. దొంగతనాన్ని కూడా చాలా కొత్తగా చేస్తున్నారు. దొంగతనం ఇలా జరుగుతుంది అని పోలీసులు ఎవేర్ నెస్ వీడియో ఒకటి చేసి జనానికి చెప్పే లోపే సరికొత్త ఐడియాలతో దూసుకుపోతున్నారు. మారుతున్న కాలంతో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తున్నారు.

             ఈ టెక్నాలజీ దొంగల్లో చాలా రకాల దొంగలున్నారు. ఫోన్ కాలింగ్ ద్వారా బ్యాంకు సమాచారం తెలుసుకుని డబ్బు మాయం చేసే దొంగలు కొందరైతే, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ని క్లోనింగ్ చేసి డబ్బు దోచుకునే వాళ్ళు కొందరు. లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉందని చెప్పి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి ఆ వ్యక్తి పేరు మీద లోన్, క్రెడిట్ కార్డ్స్ తీసుకుని జల్సా చేసేవాళ్ళు కొందరు. ఇంకొంతమంది ఇంకా అడ్వాన్స్ గా ఆలోచించి ఏకంగా atm లోనే దొంగతనాలు స్టార్ట్ చేసేశారు. సీసీ కెమెరాకి దొరక్కుండా ఒక టెక్నిక్ ని యూజ్ చేస్తారు. atm కార్డ్ పెట్టగానే మనీ వచ్చే చోట అచ్చం అలానే ఉండే ఒక బాక్స్ టైప్ పరికరాన్ని అతికిస్తారు. ఇక డబ్బులు డ్రా చేశాక రిసీప్ట్ వస్తుంది. అది రాకుండా ఉండేందుకు సెల్లో టేప్ అతికిస్తారు. దీంతో ఎవరైనా క్యాష్ డ్రా చేయడానికి వస్తే డబ్బులు బయటకి రావు. ఎందుకంటే అడ్డంగా బాక్స్ ఉంటుంది కాబట్టి. బాక్స్ లోపల డబ్బులు అలానే ఉంటాయి. ఆ బాక్స్ atm లో భాగమే అని అనుకుంటారు తప్ప అనుమానం రాదు.

                రిసీప్ట్ రాకపోవడంతో డబ్బులు లేవేమో అని, ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకుని వెళ్లిపోతాడు. వెంటనే, ఆ దొంగ అక్కడికి చేరుకుని ఆ బాక్స్, సెల్లో టేప్ తొలగించి డబ్బు తీసుకుని రిసీప్ట్ డస్ట్ బిన్ లో పడేస్తాడు. మళ్ళీ బాక్స్, సెల్లో టేప్ అతికిస్తాడు. రోజంతా ఇదే దొంగ పని. ఇలా చాలా మంది డబ్బులు లేవనుకుని వెళ్ళిపోయి చాలా డబ్బు నష్టపోయారు. ఐతే, డబ్బులు కట్ అయినట్టు ఫోన్ లో మెసేజ్ వస్తే, చదువుకున్న వాళ్ళు ఐతే బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. అలా చేసిన ఒక వ్యక్తి వల్ల ఈ హై అండ్ మోడల్ దొంగతనం గురించి బయటపడింది. దీంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని ఇప్పటికే ఇలాంటి దొంగతనాలకి పాల్పడే వాళ్ళని చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. అందుకే atm లలోకి వెళ్ళిన తర్వాత ఆ atm కరెక్ట్ గా ఉందో, లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ అనుమానం వస్తే వెంటనే సంబంధిత బ్యాంకుకు వెళ్ళి సంప్రదించాలి. అంతేకాకుండా, ఫోన్ కి మెసేజ్ అలర్ట్స్ వచ్చేలా ఫోన్ నంబర్ ని రిజిస్టర్ చేసుకోవాలి. ఎప్పుడు ఏ లావాదేవీలు జరిగినా మొబైల్ కి మెసేజ్ వచ్చేస్తుంది. 

Comments