నిధి కోసం మహిళతో నగ్న పూజలు చేయించిన స్వామీజీ ..! డబ్బు ఖర్చు ఫలితం లేదు స్వామీజీని చొక్కా పట్టుకొని నడిరోడ్డుపై గొడవచేసింది.

Swami with naked worship with woman for treasure

             నిధి కోసం మహిళతో నగ్న పూజలు చేయించిన స్వామీజీ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు

             సాంకేతికంగా ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొందరిలో మూఢ నమ్మకాలు మాత్రం పోవడం లేదు. ఈ మూఢనమ్మకం కారణంగానే నకిలీ స్వామీజీలు, బాబాలు కొత్తగా పుట్టుకొస్తున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేస్తున్నారు. డబ్బు పోగొట్టుకునేంత మూఢనమ్మకం ఉన్నా పర్లేదు కానీ, శీలం పోగొట్టుకునేంత మూఢనమ్మకం ఐతే ఉండకూడదు. నగ్నంగా పూజలు చేస్తే మీకు నిధులు దొరుకుతాయనో, లేదంటే ఒక రాత్రి గడిపితే దశ తిరిగిపోతుందనో చెప్పే దొంగబాబాల మాట విని మోసపోతున్న మహిళలు ఎందరో ఉన్నారు. వాళ్ళలో

             కర్నూలు జిల్లా మాధవరం గ్రామానికి చెందిన ఓ మహిళ ఉన్నారు. ఆమె ఇంటికి తరచూ పాము వచ్చేదట. ఆమె ఈ విషయాన్ని రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి చెప్పింది. దీంతో అతడు ఈ విషయమై అనంతపురం జిల్లా పామిడికి చెందిన ఒక స్వామిని ఆశ్రయించడంతో ఆ స్వామీజీ ఈ మహిళ ఇంటికి వచ్చి పరిశీలించాడు. ఆ తరువాత ఆమెతో మీ ఇంట్లో నిధి ఉందని, అయితే రాత్రి పూట నగ్నంగా పూజలు చేస్తేనే ఆ నిధి దొరుకుతుందని నమ్మబలికాడు. అయితే ఇందుకోసం అతడు రూ.30 వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అందుకు సరేనన్న ఆమె ఆ స్వామీజీ చెప్పిన ప్రకారమే ఓ రోజు రాత్రి తన ఇంటికి వచ్చిన స్వామితో కలసి నగ్న పూజలు నిర్వహించింది. పూజ ముగిసి రోజులు గడిచినా నిధి బైటపడలేదు. పాము రావడం ఆగిపోలేదని ఆ మహిళ చెబుతోందట. దీంతో ఆగ్రహం చెందిన ఆ మహిళ స్వామీజీని నా డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగింది. దీంతో స్వామి ఇస్తానని చెప్తూ ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడ.

               దీంతో ఆ మహిళ తనకు ఆ స్వామీజీని పరిచయం చేసిన వ్యక్తిని నడిరోడ్డుపై చొక్కా పట్టుకొని గొడవచేసింది. డబ్బులివ్వకపోతే బజారుకు ఈడ్చి తంతానని ఆ వ్యక్తిని కొట్టింది కూడా. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ఉదంతం సంచలనం సృష్టించడంతో పాటు పంచాయితీ పోలిస్ స్టేషన్ కు చేరింది. దీనిపై ఏఎస్‌ఐ గోపాల్‌వివరాలు అడుగగా ఈ గొడవ 6 నెలల కిందటిదని, అయితే డబ్బు కోసం గొడవ ఇటీవలే జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే జనాలు ఇలాంటి మూఢ నమ్మకాలతో మోసపోవద్దని హెచ్చరించారు. అదండి విషయం, ఇంట్లో పాము వస్తే పాములు పట్టేవాళ్ళకి చెప్తే పరిష్కారం చూపిస్తాడు. దొంగ పూజలు చేసే దొంగ బాబాకి చెప్తే ఏం చేస్తాడు? నగ్న పూజలు చేసి డబ్బులు పట్టుకుని పారిపోవడం తప్ప. డబ్బు కంటే విలువైంది, ఆమె అతని ముందు నగ్నంగా కూర్చున్నప్పుడే కోల్పోయింది. ఇక ముప్పై వేలు ఒక లెక్క? అయినా, ఏ ఇంటి కింద ఏ నిధి ఉందో, ఎక్కడ ఎంత డబ్బు ఉందో తెలిసినప్పుడు వాడికంటే ఉన్నవాడు ఎక్కడా ఉండడు కదా. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు?

Comments