ఇద్దరి మధ్య తేడా చూడండి...! || Anushka vs Samantha |

                   ఆ ఒక్క విషయంలో అనుష్కని బీట్ చేయడం కష్టం

               దశాబ్ధానికి పైగా ఇండస్ట్రీలో సాలిడ్ గా సెటిల్ అయిన సాలిడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అనుష్క పేరే వినబడుతుంది. గ్లామర్ కి గ్లామర్, పెర్ఫార్మెన్స్ కి పెర్ఫామెన్స్ రెండూ కలగలిపి మాంచి విందు భోజనం వడ్డించగల సత్తా అనుష్కది. ఈ విషయంలో ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ కూడా అనుష్కలా చేయలేరనేది వాస్తవం. అప్పట్లో విజయశాంతి ఎలాగో ఇప్పుడు అనుష్క అలాగ. ఒక పక్క హీరోల సరసన హీరోయిన్ గా చేస్తూనే, మరోపక్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్  చేస్తూ సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఈ జేజమ్మ...అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. సాధారణంగా ప్రేక్షకులు హీరోని చూసే సినిమాకి వెళ్తారు.

              హీరోయిన్ సినిమా అనేసరికి అంతగా ఇంట్రస్ట్ చూపించరు. కానీ అనుష్క విషయంలో ఈ సీన్స్ రివర్స్ అయ్యింది. సాలిడ్ పర్సనాలిటీ ఉన్న కారణంగా అనుష్కనే హీరోగా ట్రీట్ చేశారు. అప్పటి వరకూ గ్లామరస్ గా చూసిన ఫేవరెట్ హీరోయిన్, సడన్ గా డీగ్లామర్ రోల్ లో కనిపిస్తే అంతగా ఆదరించరు. కానీ స్వీటీ పెర్ఫార్మెన్స్ కి పిచ్చెక్కిపోయిన ఫ్యాన్స్ ఆరాధించడం మొదలుపెట్టారు. అందుకే తెలుగులో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి అనుష్క సక్సెస్ అయినంతగా ఎవరూ సక్సెస్ కాలేదు. చాలా మంది అలాంటి ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నారు. తాజాగా ఈ లిస్టులోకి సమంతా చేరిపోయారు. ఇప్పటివరకూ హీరోల సరసన ఆడిపాడిన సమంతా, "యూ-టర్న్" అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ముందుకొచ్చారు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు ఈ చిత్రం ఏకంగా మూడున్నర కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ రాకపోవడంకు కారణం స్టార్ కాస్టింగ్ లేకపోవడమే అంటున్నారు. ఇదే సినిమా అనుష్క చేస్తే కనుక ఓపెనింగ్స్ భారీగా వచ్చేవని అంటున్నారు.

            ఆమద్య అనుష్క హీరోయిన్ గా వచ్చిన భాగమతి మూవీ మంచి టాక్ ను రాబట్టలేక పోయింది. కాని అనుష్కకు ఉన్న క్రేజ్ కారణంగా ఆ మూవీ భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. కాని సమంతలో ఆ సత్తా లేదని తేలిపోయింది. సమంత ముందు ముందు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసినా కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. హీరో పక్కన అయితేనే సత్తా చాటగల సమంత సోలోగా మాత్రం అంత స్టామినా చూపించలేకపోవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. "ఇండస్ట్రీలో సమంతా లాంటి హీరోయిన్స్ పక్కన హీరోలు ఉంటేనే వేల్యూ, లేదంటే జీరోనే. మా స్వీటీ అనుష్కకి ఏ హీరో అవసరం లేదు. స్వీటీయే మా హీరో, ఆమే మా హీరోయిన్. పవన్ కల్యాణ్ ఫ్లాప్ సినిమాకి ఎలాగైతే కలెక్షన్స్ వస్తాయో, అనుష్క సోలోగా నటించిన ఫ్లాప్ సినిమాకి  కూడా అదే విధంగా కలెక్షన్స్ వస్తాయ్" అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Comments