Chammak Chandra Real Life Story || Unknown Facts of Chammak Chandra|Jabardast

               చమ్మక్ చంద్ర ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసాచమ్మక్ చంద్ర ఇల్లు చూస్తే షాక్ అవుతారు

                   టాలెంట్, కష్టపడే తత్వం ఈ రెండూ ఉండాలే కానీ మనిషి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఈ రెండూ పెట్టుబడి పెడితే చాలు, రాబడి కోట్లలో ఉంటుందనడానికి జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్రనే ఉదాహరణ. ఐతే, ఈ సంతోషం అంత ఈజీగా వచ్చింది కాదు. సంతోషం అంత ఈజీగా రాదు. ఈ సంతోషం వెనుక ఎన్నో సమస్యలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో అవాంతరాలు, మరెన్నో అవమానాలు ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించి ముందుకు దూసుకుపోయేవాళ్లే ఇక్కడ నిలబడతారు. "నువ్వు నడిచే దారిలో మొరిగే ప్రతీ కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోతే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోలేవు" అని మహాకవి శ్రీశ్రీ చెప్పిన ఈ సూత్రాన్ని గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అనుసరిస్తారు. ఎవరేమన్నా పట్టించుకోరు. "ఏరా, నువ్వు ఆర్టిస్ట్ వా? నువ్వు హీరోవా? నీ మొఖం ఒకసారి అద్దంలో చూసుకున్నావా?" అనే చులకన మాటలు ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ లైఫ్ లోనూ ఎదురవుతాయ్. చిరంజీవి సైతం ఇలాంటి అవమానాలని చవి చూశారు. చంద్ర కూడా ఇలాంటి అవమానాలను తట్టుకుని నిలబడ్డారు.

              ఈ ప్రపంచంలో కష్టమైన జాబు ఏదైనా ఉంది అంటే అది ఆర్టిస్ట్ అవ్వడం. అది నటించడమా? లేక నర్తించడమా? మాటలు రాయడమా? దర్శకత్వం వహించడమా? ఏదైనా కావచ్చు. సినీ పరిశ్రమలో గుర్తింపు వచ్చాకే కడుపు నిండా అన్నం తినగలరు. లేదంటే అప్పటివరకూ కృష్ణానగర్ రోడ్ల మీద తిరుగుతూ, అవకాశాల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరుగుతూ, ఒక్క పూటే తింటూ, రెండో పూట పస్తులుంటూ గెలిచేవారకూ పోరాడాలి. అదే జీవితం, అదే సినీ ప్రేమికులకి తెలిసిన సత్యం. ఇలా దుర్భరమైన జీవితాన్ని గడిపి ఈరోజు కోట్లకి పడగలెత్తిన వాళ్ళు  ఎందరో ఉన్నారు. అలా ఎదిగిన వాళ్ళలో ఒక సాధారణ జాతి నుంచి వచ్చిన చంద్ర ఉన్నారు. తమ జాతికే గొప్ప పేరు తీసుకొచ్చారు. తినడానికి తిండి లేకుండా ఎన్నో రోజులు గడిపారు, చేతిలో డబ్బులు లేకుండా జీవించారు. అవకాశాల కోసం పడిగాపులు కాశారు. "ఒక్క అవకాశం రాకపోదా, నా టాలెంట్ ఏంటో చూపించుకోలేనా" అని మదనపడిన రోజులు ఎన్నో ఉన్నాయ్ చంద్ర జీవితంలో. అలా మదనపడుతున్న అతని జీవితంలోకి జబర్దస్త్ షోతో బ్రేక్ వచ్చింది. అంతే ఒక్కసారిగా స్టార్ అయిపోయారు.

             ఇంట్లో భార్యా, భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలే తన స్కిట్ ఫార్మాట్, అదే తన హిట్ ఫార్ములా. ఒక్కసారి కూడా బోర్ కొట్టించకుండా ఇలాంటి స్కిట్ లు ఎన్నో చేసి కడుపుబ్బా నవ్వించారు. అలా నవ్విస్తూనే షోలో సెటిల్ అయిపోయారు, జీవితంలోనూ సెటిల్ అయిపోయారు. ఒకప్పుడు అద్దె ఇంట్లో ఈగలు ముసిరే చోట ఉన్న చంద్ర, ఇప్పుడు కోటి రూపాయల ఇంట్లో ఉంటున్నారు. ఒకప్పుడు కాలినడకన నడిచి వెళ్ళిన చంద్ర, ఇప్పుడు కారులో తిరుగుతున్నారు. హైదరాబాద్ లోని మణికొండలో కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. బెంజ్ కారు కూడా కొనుక్కున్నారు. కష్టపడ్డారు, టాలెంట్ తో పైకొచ్చారు, మస్తుగా సంపాదిస్తున్నారు. కష్టపడేతత్వం, టాలెంట్ ఈ రెండూ పెట్టుబడి పెడితే ఎవరైనా ఎదగచ్చు అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అవసరం లేదనుకుంట.  

Comments