తల్లి దేహంపై అఘోర పూజలు బయటపడ్డ భయంకరనిజాలు |Tamilnadu Incident Shocking Facts Latest News|

                రెచ్చిపోయిన అఘోరా ! తల్లి శవం పై కూర్చొని ఏమి చేశాడో చూడండి !
 

                       తమిళనాడులోని తిరుచ్చు జిల్లాలో తిరువంభిపూర్ జై అనే ఓ అఘోరా కాళీ దేవాలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నాడు. మరో కొన్ని రోజులో ఈ ఆలయం వార్షికోత్సవం ఘనంగా జరగననుండి. అయితే ఈ సమయంలో ఆ అఘోరా తల్లి మరణించింది. అయితే తల్లి చనిపోయిన తరువాత ఆ జై అనే అఘోరా చేసిన పనికి ఉరి జనం అంతా భయపడిపోయారు. జై తన తల్లి పార్దీవ దేహం మీద కూర్చొని తాంత్రిక పూజలు చేశాడు. అది కూడా పట్టపగలు. ఉరి నడి మధ్యలోనే . జై అని పిలవబడే ఈ అఘోరా అసలు పేరు మణికంఠ. చాలా చిన్న వయసులోనే ఇంటి నుండి పారిపోయి అఘోరాలతో సహవాసం చేసి తాను అలా మారిపోయాడు. 
                  అయితే ఇప్పుడు తమిళనాడులో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. కొంత మంది చోటా మోటా పొలిటికల్ నాయకులు.. తమ తమ నియోజకవర్గాల పరిధిలో కాళీ మాత ఆలయాలను నిర్మించి అందులో అఘోరాలను తెచ్చి పెడుతున్నారు. జై కూడా త్వరలో వార్షికోత్సవం జరగబోతున్న ఆలయంలో అలా కాపలాగా ఉంటున్న అఘోరానే. అయితే సుమారు ఓ సంవత్సర కాలంగా ఊరిలోనే ఉంటున్న ఈ అఘోరా ఎవ్వరిని ఇబ్బంది పెట్టింది లేదు. కానీ తల్లిపోయిన క్షణంలో ఆమె శవం మీద కూర్చొని గట్టిగా మంత్రాలు ఉచ్చరిస్తూ.. తాంత్రిక పూజలు చేయడంతో ఉరి జనం అంతా భయంతో వణికిపోయారు. దీనికి తోడు జై అఘోరాకి తోడుగా మరి కొంత మంది అఘోరాలు గ్రామంలోకి రావడం గ్రామస్థులకు మరింత భయాన్ని పెంచింది. ఇక ఈ విషయం తెలుసుకొని రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఈ ఘటన పై ఆ జై అఘోరాని వివరణ అడగగా.... తన తల్లి ఆ దేవుని కోసం ఆత్మ బలిదానం చేసిందని, తాను ఇలా తాంత్రిక పూజ చేయడం వల్లనే అ ఇప్పుడు తన తల్లి ఆత్మ స్వర్గానికి చేరుకుంది అని బదులివ్వడంతో షాక్ అవ్వడం పోలీసుల వంతు అయ్యింది. ఏదేమైనా.. ఇలా అఘోరాల తాంత్రిక విద్యలు.. ఊరిలో జనావాసాల మధ్య జరిగే పరిస్థితి వచ్చింది అంటే అది మంచి విషయం కాదనే చెప్పుకోవాలి. 

Comments