చికెన్ కొనడం అంటే చావుని కొనుకున్నట్టే....

Buying a chicken

           చికెన్ కొనడం అంటే చావుని కొనుకున్నట్టే

                  మనలో చాలా మందికి చికెన్ తో చేసిన వంటకాలంటే చాలా ఇష్టం. ఎక్కువగా అందరూ ఇష్టపడేది మాత్రం చికెన్ బిర్యానీయే. స్పైసీగా ఉన్న ఆ చికెన్ బిర్యానీ తింటూ, లెగ్ పీసుల్ని తింటా ఉంటే అబ్బా ఆ కిక్కే వేరు. ఆ టేస్టే వేరబ్బా. కానీ ఆ చికెన్ ఐటమ్స్ తింటే మనిషి చనిపోయే అవకాశం ఉందని మీకు తెలుసా? ఈ విషయం నేను చెప్పడం లేదు, డాక్టర్లు చెబుతున్నారు. రెస్టారెంట్ కి వెళ్ళి చికెన్ బిర్యానీ కానీ, చికెన్ ఐటమ్స్ కానీ తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. దీనికి అనేక రకాల కారణాలను చెబుతున్నారు. హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో తక్కువ రేటుకి వస్తుందని ఎక్కువ మొత్తంలో మాంసాన్ని ముందే కొని ఫ్రిడ్జ్ ల్లో నిలవ ఉంచుతారు. దీని  వల్ల ఆ మాంసం మీద విషపూరితమైన బ్యాక్టీరియాలు పుట్టుకొస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చీప్ గా వస్తాయని చాలా మంది రెస్టారెంట్ ఓనర్లు జబ్బుతో చనిపోయిన కోళ్ళను కొంటున్నారు. ట్రాన్స్ పోర్ట్ లో వేరే ప్రదేశం నుంచి తరలిస్తుండగా దారిలోనే చనిపోయిన కోళ్ళను అధిక మొత్తంలో తక్కువ ధరకు కొంటున్నారు.

                    ఒకవేళ బతికి ఉన్న కోళ్ళను కొన్నా అవి ఆరోగ్యంగా ఉన్నాయా, లేదా అన్నది పట్టించుకోరు. ఎక్కువ మొత్తంలో  మాంసాన్ని కొని వాటిని రోజులు, నెలల కొద్దీ ఫ్రిడ్జ్ లలో నిల్వ చేస్తున్నారు. ఆ విధంగా నిల్వ ఉంచిన మాంసం, ఎన్ని రోజులైనా వాసన రాకుండా ఉండడం కోసం వాటిలో కొన్ని రసాయనాలు కలుపుతున్నారు. దీని వల్ల చికెన్ తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి ఫుడ్ ని రెగ్యులర్ గా తీసుకుంటే అనేక రకాలైన దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని అంటున్నారు. చీప్ గా దొరుకుతుందని క్వాలిటీ లేని మాంసాన్ని కొనడంతో పాటు, వంటలు చేసే కిచెన్ లు చెత్త కుప్పల కంటే దారుణంగా ఉండడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ వంటకాల్లో ఉపయోగించే మసాలాలు, వంటనూనె కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని అంటున్నారు. తక్కువ రేటుకే వంట నూనె వస్తుందని చాలా రెస్టారెంట్ల వాళ్ళు ఎక్కువ మొత్తంలో కొంటున్నారు. నిజానికి అది వంట నూనె కాదు, హైదరాబాద్ లోని శివారు ప్రాంతంలో చనిపోయిన కొన్ని జంతువుల ఎముకల నుంచి తీసిన నూనె. దాన్ని తక్కువ రేటుకి రెస్టారెంట్లకు అమ్మేస్తున్నారు. ఇలాంటి నూనెతో చేసిన వంటకాలు తింటే ఉదర సంబంధిత రోగాలు మరియు క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.  ఎందుకొచ్చిన గొడవ, బయట హోటల్స్ లో తినడం మానేసి ఎంచక్కా ఇంట్లో వండుకు తింటే  ఎంత బాగుంటుంది అనుకుంటున్నారా. ఐతే ఈ జాగ్రత్తలు కూడా పాటిస్తే మంచిది.

                  మనకి ఇప్పుడు చికెన్ సెంటర్లలో దొరికే చికెన్, శాస్త్రీయ పద్ధతుల్లో పెంచిన కోళ్ళ నుంచి వచ్చిన చికెన్ కాదట. సాధారణంగా ఒక కోడి పిల్ల పెరిగి చికెన్ షాప్ కి రావడానికి సుమారు 60 నుంచి 65 రోజులు పడుతుంది. కానీ ఇప్పుడున్న చాలా పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళు, పుట్టిన కోడి పిల్ల త్వరగా ఎదిగి డబ్బులను ఎక్కువగా సంపాదించాలనే ఉద్దేశంతో ఆ కోడి పిల్లలకి వివిధ రకాల స్టెరాయిడ్ లు ఎక్కిస్తూ 30 రోజుల్లో ఎదిగేలా చేస్తున్నారు.

                 సాధారణంగా కోడి పిల్లలకి జబ్బులు రాకుండా ఉండడం కోసం కొన్ని మందులు ఇవ్వడం సహజమే కానీ, త్వరగా ఎదగడానికి కోడి పిల్ల పుట్టిన మూడో రోజునుంచే రెగ్యులర్ గా ఇచ్చే వాక్సిన్ లతో పాటు స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారు. వాటితో పాటు ఆ కోళ్ళు తినే దాణాలో అవి త్వరగా బరువు పెరిగేందుకు కొన్ని రకాల రసాయనిక పదార్ధాలను కూడా వాడుతున్నారు.

               వీటి ప్రభావం వల్ల రెండు వారాల్లోనే బరువు, ఎత్తు పెరిగిపోయి ముప్పై రోజుల్లోనే అమ్మకానికి రెడీ అయిపోతున్నాయ్. ప్రపంచంలో అమెరికా, చైనా, బ్రెజిల్ దేశాల తర్వాత అధిక శాతం చికెన్ ఉత్పత్తి చేసే దేశాలలో మనదేశమే ఉంది. కేవలం  ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైనే వ్యాపారం జరుగుతుంది. 14 కోట్ల నుంచి 16 కోట్ల కేజీల చికెన్ అమ్ముడుపోతుంది. పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని దేశంలోనే చాలా పౌల్ట్రీ యజమానులు కోళ్ళకి గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లు, కొన్ని రకాల యాంటీ బయోటిక్స్ వాటి దాణాలో కలిపి ఇవ్వడం వల్ల 60 రోజుల్లో రావాల్సిన 2 నుంచి 3 కేజీల బరువు ముప్పై రోజులకే వచ్చేస్తుంది. ఇలాంటి చికెన్ ను తినడం వల్ల యాసిడిటీ ప్రాబ్లమ్స్, మరియు రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల బాలికలలో ప్రీమెచ్యూర్ వంటి సమస్యలు, షుగర్ వంటి వ్యాధులు, ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు వివిధ రకాలైన భయంకరమైన జబ్బులు సోకుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కీళ్ల నొప్పులు రావడంతో పాటు అనారోగ్య పాలు చేసి తొందగరగా కోలుకునే శక్తి కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు చికెన్ అంటే మంచి రుచికరమైన మాంసాహారం, కానీ ఇప్పుడు రసాయనాలతో కూడిన ఫుడ్ గా మార్చేశారు. దీని వల్ల లేని పోని రోగాలతో మంచాన పడుతున్నారు. సో, అదండి...చికెన్ కొనుక్కోవడం అంటే, చావుని కొనుక్కున్నట్టే. కాబట్టి చికెన్ తినే విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి.  

Comments