బాలయ్య మనసు కరిగిన క్షణం.. దట్ ఇస్ బాలయ్య || Balakrishna Helping Nature

             బాలయ్య సాయానికి వృద్ధుడి కంటతడి..వైరల్

                  చూడ్డానికి బాలయ్య బాబు కోపంగా ఉంటారు కానీ ఆయనది వెన్నలాంటి మనసని దగ్గర నుంచి చూసినవాళ్లు చెప్తారు. ఆయన ఫ్యాన్స్ ని తిట్టడం, కొట్టడం లాంటివే కాదు, అప్పుడప్పుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు కూడా. దీనికి తాజా ఉదంతమే ఉదాహరణ. హంసల దీవిలో 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ లో భాగంగా బిజీగా ఉన్న బాలయ్య దగ్గరకి ఓ నిరుపేద వృద్ధుడు వస్తే ఆయన తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఆ వృద్ధుడి సమస్యని విని కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య వెంటనే అతనికి పరిష్కార మార్గం చూపించారు. హీరోగా, రాజకీయ నాయకుడిగా, క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ గా బాలకృష్ణ జీవితాన్ని బేలన్స్ చేసుకునే విధానం పట్ల ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎక్కువగా సినిమాలు, రాజకీయాలతో బిజీబిజీగా గడిపే బాలయ్య, తీరిక దొరికినప్పుడు మాత్రం క్యాన్సర్ హాస్పిటల్ లో ఉన్న రోగుల యోగ క్షేమాల గురించి తెలుసుకుంటూ ఉంటారు.

               ఆ సమయంలో తమకు సాయం చేయాలంటూ తన దగ్గరకు వచ్చే క్యాన్సర్ బాధితులకు బాలయ్య బాబు...ఆపన్న హస్తం అందిస్తుంటారు. అదే తరహాలో తాజాగా సాయం కోరుతూ తన దగ్గరకు వచ్చిన ఓ వృద్ధుడికి బాలకృష్ణ ఆపన్న హస్తం అందించారు. ఆ వృద్ధ క్యాన్సర్ రోగికి బసవతారకం ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు బాలయ్య ఏర్పాట్లు చేయించారు. బాలయ్యని కలిసి, "తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, తనకు సాయం చేయాలని" దీనంగా అర్థించాడు. ఆ వృద్ధుడి బాధ చూసి చలించిపోయిన బాలయ్య వెంటనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఫోన్ చేశారు. ఆ వృద్ధుడికి ఉచితంగా మెరుగైన చికిత్స అందించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. ఆయన చేసిన సాయానికి ఆ వృద్ధుడు ఆనందభాష్పాలు రాలుస్తూ బాలకృష్ణ కాళ్లకు మొక్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బాలయ్యది చాలా గొప్ప మనసని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.

Comments