ఇజ్రాయిల్ గురించి షాకింగ్ నిజాలు || Unknown Facts about Isreal Country |

               ఇజ్రాయెల్ గురించి మీకు తెలియని నిజాలు

              ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పూజించే ఏసుక్రీస్తు పుట్టిన పుణ్యస్థలం "ఇజ్రాయెల్" దేశం. ఈ దేశ రాజధాని జెరూసలేమ్. ఈ దేశంలోని ప్రజలు హిబ్రూ, అరబిక్ భాషలను అధికారికంగా మాట్లాడతారు. ఇక్కడ పార్లమెంటరీ ప్రజస్వామ్యం నడుస్తుంది. ఈ దేశానికి 1948 మే 14న స్వాతంత్ర్యం వచ్చింది. ఈ దేశం యొక్క విస్తీర్ణం 8,500 చదరపు మైళ్ళు. ఈ దేశం యొక్క కరెన్సీ "కొత్త ఇజ్రాయెల్ షెకిల్". మనదేశంలో ఉన్న కరెన్సీ నోట్ల మీద అంధులకి సైతం అర్ధమయ్యేలా బ్రెయిలీలిపి ఉంటుంది. అలానే ఇజ్రాయెల్ దేశంలో కూడా నోట్లపై కూడా బ్రెయిలీ లిపి ఉంటుంది.

         ఈ దేశంలో మొత్తం జనాభా 84 లక్షలు ఉంది. ఈ దేశంలోని మొత్తం జనాభాలో 70 లక్షలకు పైగా యూధులే ఉంటారు. ఈ విధంగా యూధులకి ప్రపంచం మొత్తం మీద ఉన్న ఏకైక ప్రదేశం, దేశం కూడా ఈ ఇజ్రాయెల్ ఏ. ఈ దేశంలోని ప్రజల జీవనకాలం 82 సంవత్సరాలు ఉంటుంది.

         ఈ దేశంలోని జెరూసలేమ్ ప్రపంచంలోనే ఎంతో ఫేమస్. వివిధ దేశాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ దేవుడికి ప్రార్ధనలు చేస్తుంటారు. అలాంటిది ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మాత్రం నాస్తికుడట. అతని పేరు "డేవిడ్ బెన్ గ్యూరియన్". మనుషులకే కాకుండా కుక్కలకి కూడా సమాధి ఉంటుందని మీకు తెలుసా? ప్రపంచంలోనే కుక్కల కోసం ప్రత్యేకంగా సమాధి ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే. కుక్కలు చనిపోతే "coastal city of ashkelon" (కోస్టల్ సిటీ ఆఫ్ యాష్ కెలన్) లో పూడ్చిపెడతారు. మొట్టమొదటిగా "మోటోరోలా" కంపెనీ సెల్ ఫోన్స్ ని ఈ దేశంలోనే తయారుచేయడం స్టార్ట్ చేసింది. అదే విధంగా ఆరోజుల్లో "వాయిస్ మెయిల్" టెక్నాలజీని కూడా ఇక్కడే డెవలప్ చేశారు. కంప్యూటర్ కి కావాల్సిన "యాంటీ వైరస్" సాఫ్ట్ వేర్ ని ఈ దేశంలో మొదటిసారిగా 1979 లోనే తయారుచేశారు.

            ప్రపంచంలోనే ఎక్కువగా లేడీ లాయర్స్ ఉన్న దేశం "ఇజ్రాయెల్". ఈ దేశంలో వంద శాతంలో 44 శాతం మహిళా లాయర్లే ఉంటారు. అందుకే ప్రపంచంలోనే ఎక్కువగా మహిళా న్యాయవాదులున్న దేశంగా ఇజ్రాయెల్ పేరొందింది. ఈ దేశంలో ఉన్న మహిళలని తప్పకుండా ఆర్మీలో చేరాలని ఆ దేశం ప్రేరేపిస్తుంది. ఈ దేశం చాలా చిన్న దేశం. కేవలం రెండు గంటలు పరిగెడితే తూర్పు దిశ నుంచి పడమర దిశకు చేరుకోవచ్చు. ఈ దేశంలో ఉండే "హూపో" అనే పక్షి మరే దేశంలోనూ కనిపించదు. ఈ దేశంలో మాత్రమే అరుదుగా కనిపించే ఈ పక్షిని తమ జాతీయ పక్షిగా చేశారు. "సైక్లమెన్ పెర్సికమ్"(Cyclamen persicum) అనే పువ్వును ఈ దేశ నేషనల్ ఫ్లవర్ గా గుర్తించారు.బస్టాపుల్లో ఉన్నప్పుడు బస్సులు రాకపోతే మనం ఏం చేస్తాం. ఎప్పుడూ లేటే అని తిట్టుకుంటాం, కాసేపు గింజుకుంటాం. అదే ఇజ్రాయెల్ లో ఐతే పుస్తకాలు చదువుకుంటారు. ఎందుకంటే ఆ బస్టాప్ లో పుస్తకాలు ఉంటాయ్ కాబట్టి. బస్ స్టాపుల్లో పుస్తకాలేంటి? విడ్డూరం కాకపోతే అని అనిపించినా అది నిజం.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ దేశంలో లైబ్రరీ బస్టాప్స్ ఉంటాయి.  బస్ రావడం లేటయితే ఈ లైబ్రరీ నుంచి నచ్చిన పుస్తకం తీసుకుని బస్ వచ్చేంతవరకూ ఫ్రీగా చదువుకోవచ్చు. అదన్నమాట విషయం.

         ప్రపంచం మొత్తం మీద పండే కూరగాయలు, తయారయ్యే స్వీట్లలో మూడో వంతు భాగం ఈ దేశస్తులే తింటుంటారు. ఎందుకంటే, ఈ దేశంలో కూరగాయలు, పండ్లు తక్కువగా పండుతాయి కాబట్టి. అందుకనే ప్రతి రోజూ కొన్ని వేల క్వింటాళ్ళ వరకూ ఆహార పదార్ధాలని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు.  ప్రపంచంలోనే అతి పురాతన నగరాల్లో ఇజ్రాయెల్, మరియు జెరూసలేం కూడా ఉన్నాయ్. ఎన్నో సంవత్సరాల నుంచి ఇవి భూమ్మీద ఉండడం వల్ల ఈ నగరాలు పూర్వం 2,3 సార్లు ధ్వంసం చేయబడ్డాయి. అయినా కూడా 23 సార్లు దీన్ని మళ్ళీ తిరిగి నిర్మించారు. ఆ తర్వాత కూడా 52 సార్లు ఈ నగరాలపై దండయాత్రలు జరిగాయి. ఈ విధంగా కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి భూమిపై ఉన్న ఈ ఇజ్రాయెల్ మరియు జెరూసలేం చాలా సార్లు నాశనం చేయబడి తిరిగి కోలుకున్నాయి.

            ఇంత ఫేమస్ అయిన ఈ దేశంపై పాకిస్తాన్ కి విపరీతమైన ద్వేషం. ఇజ్రాయెల్ దేశాన్ని దేశంగా గుర్తించదు. అందుకే, పాకిస్తాన్ నుంచి ఎవరైనా వచ్చి ఇజ్రాయెల్ కు జెరూసలేంని దర్శించాలనుకుంటే, ఆ పాకిస్తాన్ పాస్ పోర్ట్ ఈ దేశంలో చెల్లదని కండిషన్ పెట్టింది. ఎందుకంటే, పాకిస్తాన్ పాస్ పోర్ట్ లపై "ఏ దేశంలో అయినా పని చేస్తుంది కానీ, ఒక్క ఇజ్రాయెల్ లో మాత్రమే ఈ పాస్ పోర్ట్ పని చేయదు" అని స్టాంప్ వేసి ఉంచుతుంది.  ఇవండి, ఇజ్రాయెల్ దేశం గురించి మీకు తెలియని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్

Comments