బాలయ్య చిన్న అల్లుడు MPగా పోటీ - ఎక్కడి నుండి తెలుసా | Balakrishna 2nd Son in Law Bharat in Politics

           ఎంపీగా బాలకృష్ణ రెండవ అల్లుడు

              విశాఖ జిల్లాలో టీడీపీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి వరుస దుర్ఘటనలతో తెలుగు తమ్ముళ్ళు కలవరపడుతున్నారు. నిన్నటి వరకూ తమతో  కలిసి తిరిగిన వారు అనూహ్యంగా మృతి చెందడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకిలా జరుగుతోందంటూ ఆవేదన చెందుతున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము మరణాలతో కుదేలైపోయిన టీడీపీకి, మరో షాక్ ఎదురయ్యింది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. ఇలా వరుసగా మరణాలు సంభవిస్తుండడంతో కార్యకర్తల్లో భయం పట్టుకుంది. ఐతే, వాళ్ళలో ధైర్యం నింపడానికి కుటుంబ సభ్యులు చొరవ తీసుకుంటున్నారు. అండగా ఉంటామని ముందుకొస్తున్నారు. దీంతో రాజకీయ సమీకరణలు కూడా మారుతున్నాయి. ఎమ్మెల్సీ మూర్తి మృతిపై స్పందించిన ఆయన మనవడు భరత్, మీడియాతో మాట్లాడుతూ "ఆయన చనిపోవడం చాలా బాధకారమని, ఐతే ఆయన శయాలను తాము కొనసాగిస్తామని, అందరికీ అండగా ఉంటామని" చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ రాజకీయాలకి దూరంగా ఉన్న ఈయన, తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగులు వేయబోతున్నారు.

            దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం ఉన్నా, మూర్తి తరువాత ఆయన కుటుంబంలో ఎవరు బయటకు పెద్దగా తెలిసింది లేదు. అలాంటిది మొదటిసారిగా రాజకీయాల్లో అడుగులు వేయబోతున్నారు. దీంతో ఆయనే, మూర్తి రాజకీయ వారసుడు అంటూ చర్చించుకుంటున్నారు. ఐతే, భరత్...మూర్తి మనవడుగా, మూర్తి పెద్ద కుమారుడు పట్టాభిరామారావు కొడుకుగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బాలకృష్ణ అల్లుడిగా అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన, బాలక్రిష్ణ రెండవ కుమార్తె తేజస్విని భర్త. మరో వైపు కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కూతురు కొడుకు. అంటే అయనకూ మనవడే. ఇటు తెలుగుదేశంలో మూర్తి, అటు కావూరి....ఈ ఇద్దరికీ ముద్దుల మనవడు కావడంతో భరత్ కి రాజకీయ వారసత్వం పుష్కలంగా ఉందని టీడీపీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇంత రాజకీయ నేపధ్యం ఉన్న భరత్ రేపటి ఎన్నికల్లో పోటీ చేస్తారని టాక్ కూడా నడుస్తోంది.

              భరత్ కి విశాఖ ఎంపీ టికెట్ ఇప్పించాలని మూర్తి ఆలోచించేవారు. వచ్చే ఎన్నికల్లో తాను వెనక ఉండి మనవడిని ఎంపీ చేయాలని ఆయన తపన పడేవారు. దానికి తగిన గ్రౌండ్ వర్క్ కూడా రెడీ అయింది. బాలయ్య కూడా తన రెండవ అల్లుడికి టికెట్ కోసం లాబీయింగ్ ఓ వైపు చేస్తున్నారు. ఇంతలో మూర్తి హఠాన్మరణం ఆ కుటుంబాన్ని, అభిమానులను కూడా క్రుంగదీసింది. అయితే మూర్తి వారసుడిగా భరత్ అన్నది మాత్రం కన్ ఫర్మ్ అయిపోయింది. నిన్నటి వరకు ఇన్నర్ సర్కిల్స్ లో ఉన్న ఈ విషయం ఇపుడు బయటకు కూడా వెల్లడైంది. మూర్తి లేని ఈ సమయంలో ఆయన కుటుంబానికి న్యాయం చేసేందుకు, భరోసా ఇచ్చేందుకైనా విశాఖ ఎంపీ టికెట్ భరత్ కి ఇస్తారన్న టాక్ నడుస్తోంది. ఓ వైపు మూర్తి ఆకస్మిక మరణంతో డీలా పడిన క్యాడర్ కి భరత్ రూపంలో కొత్త నాయకత్వాన్ని అందించాలని పార్టీ భావిస్తోంది. యువకుడైన భరత్ విశాఖలోనే చదువుకున్నారు. రేపటి ఎన్నికల్లో పోటీకి ఆయనే సరైన క్యాండిడేట్ అని అంతా ఇపుడు అనుకుంటున్నారు.

 

Comments