వీళ్ళిద్దరూ తండ్రి కూతుర్లు కాని ఈమె కొడుకు అతడికి ఏమవుతాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు |

            మరో వింత సంఘటన....తోకతో పుట్టిన వింత శిశువు చూసి డాక్టర్లు షాక్

 

             బ్రహ్మం గారు చెప్పినట్టు ఇప్పటికే మనం ఎన్నో వింతలను చూశాం, ఇప్పటికీ చూస్తున్నాం. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏ వింత ఘటన చోటు చేసుకున్నా ఇట్టే తెలిసిపోతుంది. మొన్నా మధ్య మేక కడుపున పంది పుట్టిందని, గేదె కడుపున కుక్క పుట్టిందని కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా, ఇలాంటి వింత ఘటనే కర్నాటకలో చోటు చేసుకుంది. ఓ మహిళకి తోక కలిగిన ఓ వింతైన శిశువు పుట్టింది. కర్నాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా సోమవారపుపేటకి చెందిన జీ.కె. కృష్ణమూర్తి, అతని భార్య చిన్నమ్మ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లై నాలుగేళ్ళు గడిచిన తమకి సంతానం కలగడం లేదని గతంలో ఓ సారి డాక్టర్లని సంప్రదించారు ఆ దంపతులు. ఐతే, ఈ మెడిసన్స్ వాడితే పిల్లలు కలుగుతారని ఆమెకి డాక్టర్ చెప్పడంతో, ఆమె కోర్స్ ప్రారంభించారు.

            డాక్టర్ చెప్పినట్టే ఆమెకి సంతానం కలిగింది. ఎన్ని రోజుల నుంచో పిల్లల కోసం కలలు కంటున్నారు. తమ కల నెరవేరే సమయం వచ్చిందని ఆనందపడ్డారు. ఐతే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆమె గర్భవతి కావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లి టెస్టులు చేసి కోర్స్ వాడడం స్టార్ట్ చేశారు. ఇదే వీళ్ళ పాలిట శాపంగా మారింది. ఈ కోర్స్ సరిగా వాడని కారణంగా కడుపులో ఉన్న బిడ్డపై అది ప్రభావం చూపింది. దీంతో ఆ శిశువు బయటకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ప్రాణం వదిలేసింది. ఆమె కడుపులో బిడ్డని బయటకి తీయడానికి డాక్టర్లు 2 గంటలు కష్టపడ్డారు. ఐతే బిడ్డని బయటకి  తీశామన్నా సంతోషం ఆ డాక్టర్స్ కి ఎక్కువసేపు లేదు. కారణం ఆ బిడ్డ వింతగా పుట్టడం. పుట్టిన బిడ్డకు ఒకటే కాలు ఉంది.  వెనక తోక లాంటి భాగం ఉంది. ఆడో, మగో తెలుసుకోవడానికి జననాంగాలు కూడా లేవని వైద్యులు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులకి షాక్ తగిలింది. పిల్లలు లేకపోవడంతో పుట్టిన వింత పిల్లనే గొప్పగా ఫీలయ్యారు. ఐతే, కొద్ది సేపటికే శిశువు మరణించడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది.

              మాకు దేవుడు అన్యాయం చేశాడంటూ ఆవేదన చెందింది. ఇక ఈ శిశువు ఇలా పుట్టడానికి కారణం జన్యు లోపమని నిర్దారించారు. పౌష్టికాహారం సరిగా అందకపోవడం వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు వివరించారు. గర్భం కోసం మెడిసన్స్ వాడేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి ఫుడ్ తీసుకోవాలని సూచించారు. వింత అని అందరూ అనుకుంటారు కానీ అదొక లోపం అని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. ఆ లోపాలు లేకుండా గర్భిణీ స్త్రీలకి మంచి పోషకాలు ఉన్న ఆహారం అందాలి. పేద గర్భిణీ స్త్రీలకు ఆ ఆహారం ఎవరు అందిస్తారు. ప్రభుత్వమే అందించాలి. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. చోద్యం చూస్తున్నాయ్. ప్రభుత్వాలు ఇలా ఉన్నంత వరకూ సమాజంలో ఉన్న లోపాలని మనం వింతలుగానే చూస్తాం. అప్పుడు వెంకబడిపోయిన మనల్ని ప్రపంచమంతా వింతగా చూస్తుంది. ఇది మారాలంటే అందరూ మారాలి. ప్రభుత్వాన్ని మార్చాలి. ఇవే కాదు ఎన్నో లోపాలు ఉన్నాయ్, ఈ సమాజంలో. వాటిని యువతే సరిదిద్దాలి. యువతే ఆ లోపాలని సరిదిద్దుతుందని ఆశిద్దాం. 

Comments